Tuesday, 7 December 2021

జీవితం సప్తసాగర మథనం

ప్రతి మనిషి జీవితంలో ఒక అత్యంత క్లిష్టమైన సమయం వస్తుంది. ఏ పనీ జరగదు. జరిగినట్టే అనిపించినా.. మనం కలలో కూడా ఊహించని విధంగా అన్నీ ఎదురుకొడుతుంటాయి. దెబ్బ మీద దెబ్బ ఏదో ఒక రూపంలో పడుతూనే ఉంటుంది.

ఊపిరి తీసుకోలేం. ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పలేం. మనకి మనం కూడా ఒప్పుకోలేం.

ఇలాంటి సమయాలు నీ అనాలోచిత పాత నిర్ణయాల పరిణామాలేకావొచ్చు. నువ్వు కొత్తగా తీసుకొన్న మంచి నిర్ణయాల చెడు ఫలితాలు కూడా కావొచ్చు.

ఇలాంటి క్లిష్ట సమయాలు కేవలం నిన్ను పరీక్షించడానికే వచ్చాయనుకోవద్దు. ఈ స్థాయి పరీక్షలను తట్టుకొనే శక్తి నీకుందని నిరూపించడానికి కూడా వస్తాయి.

“నో.. ఇంక నావల్లకాదు” అనుకుంటున్నావా?

అవసరంలేదు.

నీమీద నాకు నమ్మకముంది.
నీగురించి నువ్వు ఆలోచిస్తున్నదానికంటే 
శక్తివంతమైనవాడివని.

నీమీద నాకు నమ్మకముంది.
నీ కలల్ని నువ్వు తప్పక నిజం చేసుకుంటావని.

నీమీద నాకు నమ్మకముంది.
నువ్వు చేరాల్సిన గమ్యం చేరుకుంటావని.

నీమీద నాకు నమ్మకముంది.
నువ్వు కూడా నీమీద నమ్మకం పెంచుకోగలవని. 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani