ఈ భూమ్మీద ఉన్న ప్రతి బిజినెస్‌లో, ప్రతి ప్రొఫెషన్‌లో ఎక్కడో ఒక చోట కొన్ని అవకతవకలు జరుగుతుంటాయి. ఎవరో ఒకరిద్దరు చేయకూడనిదేదో చేస్తుంటారు.
అది రియల్ ఎస్టేట్ కావచ్చు. స్టీల్ ఇండస్ట్రీ కావచ్చు. మైనింగ్ కావచ్చు. మెడికల్ ఫీల్డు కావచ్చు. ఎడ్యుకేషన్ కావచ్చు. సినిమా ఫీల్డు కావచ్చు... జర్నలిజం కూడా కావచ్చు.
ఈ దేశంలో ఏదీ సొక్కం కాదు. ఏదీ ప్యూర్ కాదు.
బిజినెస్ అన్న తర్వాత సవాలక్ష జరుగుతుంటాయి. "సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్" అనేది ఈ భూమి ఉన్నంత కాలం ఉండే ఒక... ప్రాక్టికల్లీ ప్రూవ్డ్ బేసిక్ థియరీ.
జర్నలిజం అయినా, సినిమా ఫీల్డయినా, పాలిటిక్స్ అయినా, క్రికెట్ అయినా... ఏదైనా ఈ బేసిక్ థియరీ పరిధిలోనే ఎక్జిస్ట్ అవుతాయి. కొనసాగుతుంటాయి.
ఇవన్నీ మర్చిపోయి... ఏవో నోటికొచ్చిన నాలుగు మాటలు మాట్లాడ్డం విశ్లేషణ అనిపించుకోదు. జర్నలిజం అనిపించుకోదు. జస్ట్ బుల్ షిట్.
థాంక్స్ టు సోషల్ మీడియా... దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఇలాంటి విశ్లేషకులే ఎక్కువయ్యారు మనకి.
కట్ చేస్తే -
నిన్న రాత్రి అనుకోకుండా ఒక గొప్ప విశ్లేషణ చూశాను. అది సినిమా ఫీల్డు పైన.
"బంగారు బాతుని చంపుకున్నారు" అని... ఇంకేదేదో అని కొన్ని కంప్లైంట్స్.
వాటిల్లో ఒకటి రెండు పాయింట్స్ నేను 100% అప్రిషియేట్ చేస్తాను.
ఫర్ ఎక్జాంపుల్... బయట పది రూపాయలుండే సమోసా... థియేటర్ లోపల 80 రూపాయలుండటం. బయట 10, 20 రూపాయలకంటే ఎక్కువుండని పాప్‌కార్న్ లోపల వందల్లో ఉండటం. కూల్ డ్రింక్స్, కాఫీ టీలు, ఇతర స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా అంతే. జస్ట్ దోపిడీ!
ఈ ఒక్క కారణం చేత - ఏవో ట్రిపుల్ ఆర్‌లు, రాధేశ్యామ్‌లు వంటి ఆడియో విజువల్లీ గ్రాండియర్ రేంజ్ ఉండే కొన్ని సినిమాలకు తప్ప -
అలాగే -
రిలీజైన రోజే సినిమా చూడాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అన్న మైండ్‌సెట్‌తో ఉండే హార్డ్ కోర్ ఫ్యాన్స్ చూసే ఏవో కొన్ని భారీ హీరోల సినిమాలకు తప్ప -
ఇక మీదట కామన్ ఆడియన్స్ థియేటర్స్‌కు రావాలని ఉన్నా రారు. ఇంట్లోనే కాలుమీద కాలేసుకొని, ఏ పల్లీలో, పాప్‌కార్నో, బ్రెడ్ ఆంలేటో తింటూ, కాఫీ త్రాగుతూ శుభ్రంగా ఓటీటీల్లో కావల్సిన సినిమాలు చూసుకుంటారు.
ఒక్క తెలుగు, హిందీ, ఇండియన్ భాషల సినిమాలే కాదు... ప్రపంచ భాషల్లోని అన్ని సినిమాల్నీ ఇంట్లో కూర్చునే చూసుకోగల సౌకర్యం ఇప్పటి ప్రేక్షకునికుంది.
సో, ఇప్పుడు థియేటర్ అనగానే ఈ దోపిడీ గుర్తొచ్చి... నోర్మూసుకొని, షార్ట్స్ వేసుకొని టీవీ ముందు కూర్చొని, హాయిగా ఓటీటీ ఆన్ చేస్తారు.
బయట కోవిడ్ భయం ఉండదు. థియేటర్లో దోపిడీ భయం ఉండదు.
ఇండస్ట్రీ పెద్దలు ఇది తప్పక ఆలోచించాల్సిన విషయం.
ఇలాంటి ఒకటి రెండు పాయింట్స్ తప్ప... 8.27 నిమిషాల ఆ ప్రోగ్రామ్‌లో, ఆ విశ్లేషకుడు చర్చించిన ఏ ఒక్క పాయింటూ లాజిక్‌కు నిలబడదు. ఆ ఒక్కో పాయింట్ మీద నేనిక్కడ చర్చించాలంటే ఇలాంటి పాడ్‌కాస్టుల సీరీస్ చెయ్యాల్సి ఉంటుంది.
అయినా సరే, ఇంకో పాయింట్ క్లుప్తంగా చర్చిస్తాను...
స్వయంగా నేనే దశాబ్దాల నుంచి వింటున్నాను... సినిమా ఫీల్డు అనగానే "ఆ నలుగురు" అంటారందరూ. అదేంటో మరి! 20 ఏళ్ల క్రితం కూడా ఇదే మాటన్నారు. ఇప్పుడూ అదే అంటున్నారు. ఆ నలుగురు తప్ప ఈ ఇరవై ఏళ్ల కాలంలో కొత్తగా ఎవ్వరూ ఫీల్డులోకి రాలేదా?
ఐమాక్స్‌లు రాలేదా, పీవీఆర్‌లు రాలేదా, రిలయన్స్ వాళ్ళ థియేటర్స్ రాలేదా?
థియేటర్స్ నడిపించే సత్తా ఉన్నవాళ్లు నడిపించుకుంటారు. ఎందుకీ గొడవ అనుకున్నవాళ్ళు లీజ్‌కు ఇచ్చుకుంటారు. లేదంటే కూలగొట్టేసి, ఏదో కాంప్లెక్స్ కట్టుకుంటారు. మాల్ కట్టుకుంటారు. అంతే తప్ప - ఎవ్వరూ ఎవ్వరి నుంచీ బలవంతంగా లీజుకి లాక్కోరు. లాక్కోలేరు.
అలాగే, థియేటర్స్ చేతిలో ఉన్న ఆ నలుగురైనా, నలభై మంది అయినా... వాటిని అద్దెకిచ్చి నడుపుకోవాలనుకుంటారు తప్ప... ఖాళీగా పెట్టుకోరు. అవైలబిలిటీ ఉంటే, రెంట్ కడితే చాలు. ఎవ్వరికైనా ఇస్తారు. ఎవరైనా సినిమాలు వేసుకోవచ్చు.
బిజినెస్ పరంగానో, వ్యక్తిగతంగానో ఎవ్వరికైనా ఏవైనా గ్రడ్జెస్ ఉన్నప్పుడు చాలా అరుదుగా కొన్ని గొడవలు జరగొచ్చు. అది ఏ బిజినెస్‌లో అయినా ఉండేదే. కాని, ఒక ఫంక్షన్ హాల్ కట్టుకున్నోడు... దానికి రోజుకి ఓ నాలుగు లక్షల రూపాయలు అద్దె వస్తోంటే ఎందుకు వద్దనుకుంటాడు?
సింపుల్ లాజిక్. అంతే.
వీళ్లంతా చెప్పే ఆ నలుగురి థియేటర్స్‌లోనే ఎన్ని చిన్న బడ్జెట్ సినిమాలు భారీ హిట్లు కాలేదు?
ఇవన్నీ పక్కనపెట్టి... సోషల్ మీడియా ఎకవుంట్ వుండి, ఇంకెక్కడా పనికిరాని ప్రతి సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావీ, ఒక స్పెషలిస్ట్‌లా సినిమా ఇండస్ట్రీ గురించీ, సినిమాల గురించీ మాట్లాడ్దం చాలా విచిత్రం.
జర్నలిజం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? జర్నలిస్టుల్లో ఇప్పుడు ఎంత మంది ఎలాంటి నైతిక విలువలు పాటిస్తూ, పక్షపాతం లేని రిపోర్టింగ్ చేస్తున్నారు? ఇదంతా జగమెరిగిన సత్యం.
అలాగని, అందరు జర్నలిస్టులనూ పక్షపాతం చూపిస్తున్నారనీ, అవినీతిపరులనీ, అడుక్కుతింటున్నారనీ, బ్లాక్ మెయిలర్స్ అనీ... ఒకే గాటన కట్టలేం కదా? అలా చేయటం, అలా అందర్నీ కామన్‌గా అనటం చాలా పెద్ద తప్పు.
అదే విధంగా -
"కళ మీద ఆధారపడ్డ బ్రతుకులు" అని సినిమా ఫీల్డు వాళ్లని జనరలైజ్ చేసి మాట్లాడ్దం ఏదైతే ఉందో... అది చాలా పెద్ద తప్పు. అది జర్నలిజం కాదు.
ఆ నలుగురు ఆ నలుగురు అంటూ ఇంత గొప్ప విశ్లేషణ చేసిన ఈ జర్నలిస్టు ఎంతో పరిశోధన చేసే ఉంటాడు కదా? ఆ నలుగురు ఎవరో, వారి పేర్లేంటో అతనికి తప్పక తెలిసే ఉంటాయి కదా?
అలాంటప్పుడు... ఎంతసేపూ ఒక్క దిల్ రాజు పేరునే చెప్తూ, మిగిలిన ముగ్గురి పేర్లు చెప్పకపోవటం వెనుక మతలబు ఏంటి?
మిగిలిన ముగ్గురి పేర్లు చెప్పాలంటే అంత భయమా? లేదంటే ఇంకేదైనా ఫీలింగా?
సారీ టు సే... ఇది జర్నలిజం అస్సలు కాదు.
^^^
Transcript of my Podcast. Written & podcast on 3-12-2021.
Anchor Link:
Youtube Link: https://youtu.be/bmB_vFd82vk
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani