ఎప్పుడో 28 ఏళ్ల క్రితమే ఒక డైరెక్టర్ జేబులో వంద కాగితంతో సినిమా ప్రారంభించారు. విజయవంతంగా పూర్తిచేసి, బిజినెస్ చేసి, రిలీజ్ చేశారు. లాభాలు కూడా వచ్చాయి.
అది 1993.
ఇది 2022.
ఇప్పుడు టెక్నికల్‌గా, మరెన్నో విధాలుగా అవకాశాలు, సౌకర్యాలూ పెరిగాయి. ఇప్పుడు జేబులో ఆ వంద కూడా అవసరం లేదు. సినిమా ప్రారంభించవచ్చు, పూర్తిచేయవచ్చు, బిజినెస్ చేయవచ్చు, రిలీజ్ చేయొచ్చు. లాభాలూ పొందొచ్చు.
అలాగని అసలు డబ్బే అవసరం లేదని కాదు. చాలా అవసరం.
కొత్తగా ఇంట్రొడ్యూస్ కావాలనుకొనే హీరోలు, ఆర్టిస్టులు... అలాగే, మేము ఇంట్రొడ్యూస్ చేసే ఒకరిద్దరు కొత్త టెక్నీషియన్స్ కొంత ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలింది పూర్తిచేయడానికి ఒకరిద్దరు లైక్‌మైండెడ్ కోప్రొడ్యూసర్స్ టీమ్‌లో చేరతారు.
కొత్తగా ఇంట్రొడ్యూస్ కావాలనుకొనే హీరోలు, ఆర్టిస్టులు... అలాగే, మేము ఇంట్రొడ్యూస్ చేసే ఒకరిద్దరు కొత్త టెక్నీషియన్స్ కొంత ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలింది పూర్తిచేయడానికి ఒకరిద్దరు లైక్‌మైండెడ్ కోప్రొడ్యూసర్స్ టీమ్‌లో చేరతారు.
కోపరేటివ్ ఫిలిం మేకింగ్...
బేటాలు, కాల్‌షీట్స్‌తో సంబంధం లేని ఒక రెనగేడ్ టీమ్.
ఎవ్వరికీ ముందు పారితోషికాలుండవు. అంతా వాలంటరీగానే పనిచెయ్యటం. టీమ్‌లో రోజుకో ఇద్దరు ఫుడ్ స్పాన్సర్ చేస్తారు. ట్రాన్స్‌పోర్ట్‌కు మన కార్లే వాడతాం. సరిపోకపోతే ఫ్రెండ్స్ కోపరేట్ చేస్తారు.
షూటింగ్ అప్పుడు స్టే, ట్రాన్స్‌పోర్ట్, ఇతర ఖర్చులు... In-Film Branding, Sponsorships నుంచి వస్తాయి.
సినిమా పూర్తయ్యి, బిజినెస్ చేశాకనే - అందరికీ ముందు అనుకున్నట్టు రెమ్యూనరేషన్ కవర్స్ అందుతాయి. ఇదేదో నేను కొత్తగా చేస్తున్న ప్రయోగం కాదు. ఇక్కడ ఆల్రెడీ నేనూ చేశాను, ఆర్జీవీ చేశాడు. అక్కడ హాలీవుడ్‌లో రాబర్ట్ రోడ్రీగజ్ చేశాడు.
టైటిల్ లోగో, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్, క్యారెక్టర్ ఇంట్రోలు, ఆర్టిస్ట్ ఇంట్రోలు, లిరికల్ వీడియోస్, టీజర్స్, ట్రయలర్స్... అన్ని రిలీజ్‌లు, అన్ని లాంచ్‌లూ ఉంటాయి.
ప్రి-రిలీజ్ ఉంటుంది. ప్రీమియర్ ఉంటుంది. ప్రమోషన్ బాగా ఉంటుంది. సినిమా భాషలో చెప్పాలంటే, అంతా 'వేరే లెవెల్' లో ఉంటుంది.
కెమెరాలు, ఇక్విప్‌మెంట్, మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ ఉండదు.
Arri Alexa LF, Red Monstro Full Frame 8K, Red Helium 8K... వంటి లేటెస్ట్ కెమెరాల్లో కనీసం రెండు కెమెరాల్ని ప్రతిరోజూ షూటింగ్‌కి వాడతాం.
ఇంతకుముందు సినిమాలు వేరు. ఇప్పుడు సినిమాలు వేరు. ఏదో తీశామా అంటే తీశాం అని కాదు.
ప్రపంచ సినిమా ఇప్పుడు ప్రతి ఒక్కడి అరచేతిలో ఉంది.
లాజిక్కులతో పనిలేని పక్కా మాస్ సినిమా అయినా సరే, స్టాండర్డ్స్ పెరిగాయి.
లాజిక్కులతో పనిలేని పక్కా మాస్ సినిమా అయినా సరే, స్టాండర్డ్స్ పెరిగాయి.
తీస్తే దిమ్మతిరగాలి.
అదీ ఇప్పటి సినిమా.
అదీ ఇప్పటి సినిమా.
ఇప్పటివరకు నేను తీసిన సినిమాలన్నిటినీ థియేటర్స్‌లోనే రిలీజ్ చేశాను. శాటిలైట్ రైట్స్ కూడా ముందే అమ్మేశాం. నా ప్రీవియస్ సినిమాను యూకేలో కూడా రిలీజ్ చేశాం.
ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా వచ్చాయి. అంతా మనవాళ్లే. ఏదీ కష్టం కాదు.
అప్పటి బిజినెస్ ట్రెండ్స్‌ను బట్టి, థియేటర్స్‌లోనే రిలీజ్ చేయొచ్చు. లేదా, ఓటీటీలో రిలీజ్ చేయొచ్చు. ఏదీ కష్టం కాదు.
అనుకున్న సమయానికి సినిమా పూర్తిచేయడం, రిలీజ్ చేయడం పక్కా. పైసా వసూల్ కూడా బానే ఉంటుంది.
మంచి ప్రాజెక్టు చెయ్యాలి. హిట్ కొట్టాలి. ఇప్పుడందరం అదే పనిమీదున్నాం. చేస్తాం.
ఫినిషింగ్ టచ్ ఏంటంటే -
"సార్... నేను ఫ్రీగా చేస్తాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి" , "నాదగ్గర బ్లాక్‌బస్టర్ కథ ఉంది, ఫ్రీగా ఇస్తాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి" అనే వేస్ట్ మెసేజెస్, కాల్స్ వద్దు.
ఫ్రీగా చేస్తాను అంటే తీసుకోడానికి నువ్వేం విజయ్ దేవరకొండ కాదు. నీ కథ ఫ్రీగా తీసుకోడానికి నువ్వేం విజయేంద్రపసాద్ గారు కాదు.
నేనూ రచయితనే. నంది అవార్డు తీసుకున్నాను. నా దగ్గర అద్భుతమైన కథలున్నాయి. మరిన్ని అద్భుతమైన కథలివ్వడానికి నాకు ఇండస్ట్రీలో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న మంచి రైటర్-డైరెక్టర్ మిత్రులున్నారు. ఫ్రీగా నటించడానికి, హైలీ టాలెంటెడ్ కొత్త ఆర్టిస్టులు ఇక్కడ మాదగ్గర బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా రెడీగా ఉన్నారు. సో, ఆ విషయంలో నో వర్రీ.
"నాకు మీతో కలిసి ప్రాజెక్ట్ చెయ్యాలని ఉంది. నేను ప్రాజెక్ట్ కోసం ఇదిగో ఇంత ఇన్వెస్ట్ చేస్తాను, లేదా చేయిస్తాను. నాకు టీమ్‌లో అవకాశం ఇవ్వండి" అంటూ... పెట్టగలిగితే, ఇలాంటి మెసేజెస్ పెట్టండి. కలుద్దాం. మాట్లాడుకుందాం. ప్రాజెక్టుకి మీరు నిజంగా పనికొస్తారు అనుకుంటే కలిసి పనిచేద్దాం.
దయచేసి వేరే ఏ మెసేజెస్ వద్దు, కాల్స్ వద్దు.
నీ గోల్, నా గోల్, మన టీమ్ అందరి గోల్ ఒక్కటే. దానికోసం కష్టపడదాం. సాధిద్దాం.
ఒక్కటే గుర్తుపెట్టుకోండి...
ఏదీ
ఊరికే
రాదు!
Anyone there?
Contact Manohar Chimmani:
Whatsapp: +91 9989578125,
email: mchimmani10x@gmail.com
PS:
కోపరేటివ్ ఫిలిం మేకింగ్ - 2 కూడా చదవండి: https://nagnachitram.blogspot.com/2021/12/2.html
Whatsapp: +91 9989578125,
email: mchimmani10x@gmail.com
PS:
కోపరేటివ్ ఫిలిం మేకింగ్ - 2 కూడా చదవండి: https://nagnachitram.blogspot.com/2021/12/2.html
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani