తను అనుకున్న జీవనశైలిని సృష్టించుకోడాన్ని మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అది బిచ్చగాడయినా ఒకటే. బిలియనేర్ అయినా ఒకటే.
ఎవడి పిచ్చి వాడికానందం.
రాజకీయాలు, సినిమాలు, క్రికెట్ .. ఈ మూడింటికీ మన దేశంలో ఉన్నంత ఇంట్రెస్టు బహుశా వేరే దేశంలో ఉండకపోవచ్చు. ఈ మూడూ మన దేశంలో కోట్లాదిమంది జీవితాల్ని డైరెక్టుగానో, ఇన్‌డైరెక్టుగానో చాలా ప్రభావితం చేస్తున్నాయి.
పాజిటివ్‌గానా, నెగెటివ్‌గానా అన్న విషయం ఇప్పటికి పక్కనపెడదాం.అదింకో చర్చ అవుతుంది.
కట్ టూ క్రియేటివిటీ -
మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసి వదిలేశాక, నా జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూశాను. సుఖాల శిఖరాగ్రాలు, కష్టాల అగాధపు అంచులు. అన్నీ చూశాను.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు .. నా జీవితంలో ఎంతో విలువైన సమయం పరమ రొటీన్‌గా వృధా చేశాక .. ఇప్పుడిప్పుడే నేను కోరుకుంటున్న స్వతంత్ర జీవనశైలివైపు అడుగులేస్తున్నాను. నిజానికి - అలా వృధా కాకపోతే, బహుశా ఇలాంటి ఆలోచన కూడా నాకు వచ్చేది కాదేమో!
క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ. ఈ రెండూ నా జీవనశైలి.
ఈ రెంటినీ ఎప్పుడూ నేను వేరుగా చూడలేను.
కమర్షియల్ సినిమానా, కేన్స్ కు వెళ్లే సినిమానా .. ఇది కాదు ప్రశ్న. నీకెంత ఫ్రీడమ్ ఉంది? నువ్వేం చేయగలుగుతున్నావు అన్నదే అసలు ప్రశ్న.
మరోవిధంగా చెప్పాలంటే - అది సినిమానా, పుస్తకాలా, పెయింటింగా, ఇంకొకటా అన్నది కూడా కాదు ప్రశ్న. నువ్వు చేస్తున్నపనిలో నీకెంత ఆనందం ఉంది అన్నదే అసలు ప్రశ్న.
ఆ ఆనందమే స్వేఛ్చ. ఆ స్వేఛ్చకోసమే అన్వేషణ.
అది నేనయినా, ఎవరయినా.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani