నా సోషల్ మీడియా ఇప్పుడు పూర్తిగా సినిమామయం అయిపోయింది. ఇంకా ఇంకా అయిపోతుంది.
అన్నీ పక్కనపెట్టి ఇప్పుడు పూర్తిగా ఈ క్రియేటివ్ బిజినెస్ మీద పడ్డాను.
ఖచ్చితమైన టైమ్‌బౌండ్ టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి అసలు బయటి ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు.
ఖచ్చితమైన టైమ్‌బౌండ్ టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి అసలు బయటి ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు.
నా ఫేస్‌బుక్, ట్విట్టర్, బ్లాగ్, నా 'ఫిలింనగర్ డైరీస్' పాడ్‌కాస్ట్... అన్నీ ఇప్పుడు సినిమా... సినిమా.
టోటల్ సినిమా.
నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న కవులు, రచయితలు, ఇతర మేధావి మిత్రులు, "ఏంట్రా బై ఇదంతా?!" అని కొంచెం ఇబ్బంది పడే అవకాశం చాలావుంది. ఇదంతా ఎంజాయ్ చేయలేనివాళ్ళు, పడనివాళ్ళు కొంత కాలం నన్ను "అన్‌ఫాలో" చేసి కొంచెం దూరంగా ఉండటం బెటరేమో!😊
కొన్ని గంటల క్రితం నుంచీ నా ప్రొఫెషనల్ మార్కెటింగ్ యాక్టివిటీని అగ్రెసివ్‌గా ముందుకు తీసుకెళ్తున్నాను. మొట్టమొదటిసారిగా, ఒక మల్టి ప్యాషనేట్ క్రియేటివ్‌ప్రెన్యూర్‌గా... నా సర్విసెస్, నా రిక్వయిర్‌మెంట్స్... ఒకదాని వెనుక ఇంకోటి అన్నీ పోస్ట్ చేశాను, చేస్తున్నాను.
కనీసం ఒక 8 అరగంటల పాటు సోషల్ మీడియా అంతా సంపూర్ణంగా వాడుకున్నాను. ఇది కంటిన్యూ అవుతుంది.
కట్ చేస్తే -
ఏదో ఒక సినిమా ప్రాజెక్టు అని కాకుండా, నా అన్ని క్రియేటివ్ వింగ్స్‌లోనూ చేతినిండా పనితో చాలా చాలా బిజీ అయిపోవాలన్నది సంకల్పం. ఆ బిజీ ఈ దసరా నుంచే పుంజుకోవాలనీ, ఊపిరి సలపనివ్వని వర్క్‌లోడ్‌తో పనిచేస్తూ, ఈ సంవత్సరం ఆఖరుకల్లా కొన్ని విషయాల్లో నేను పూర్తిగా 'ఫ్రీ అయిపోవాలని' కూడా గట్టిగా అనుకున్నాను.
పని చేస్తూవుంటేనే అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి. 'అనుకోకుండా జరుగుతాయని మనం అనుకొనే మిరాకిల్స్' కూడా మనం పని చేస్తూవుంటేనే జరుగుతాయని నా నమ్మకం, నా అనుభవం.
అదృష్టం ఎక్కడో ఆకాశం నుంచో, మన తారల నుంచో జారిపడదు. మనం ఎంత కష్టపడితే అంతగా మనల్ని ఇష్టపడుతుంది, మన వెంటపడి వస్తుంది. ఈ అదృష్టాన్ని నేను బాగా నమ్ముతాను.
ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులు. అందరికీ నా వినమ్ర వందనం. 🙏
ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులు. అందరికీ నా వినమ్ర వందనం. 🙏
Believe in your heart that you're meant to live a life full of passion, purpose, magic and miracles.”
― Roy T. Bennett
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani