ఎగతాళి చేస్తారు, సెటైర్లు వేస్తారు, తిడతారు, నానా చెత్త మాట్లాడతారు.
అయితే - వీళ్ళంతా అర్థం చేసుకోలేని విషయం ఒకటుంది... ప్రపంచంలోని ఏ ఫీల్డు అయినా సినిమా ఫీల్డు లాంటిదే.
ఇక్కడుండే అన్‌సర్టేనిటీ అన్ని ఫీల్డుల్లో ఉంటుంది. బయటి ఫీల్డుల్లో జరగని తప్పులు, రాజకీయాలేవీ ఇక్కడ స్పెషల్ గా జరగవు, స్పెషల్ గా ఉండవు.
ఒప్పుకోడానికి ఇష్టం ఉండదు అంతే.
అందరూ ఈ ఫీల్డు మీద పడి ఏడవటానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే – ఇక్కడ గ్లామర్ ఉంది. సెలబ్రిటీ స్టేటస్ ఉంది. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా బ్రేకింగ్ న్యూస్ అవుద్ది.
అదొక్కటే. అంతకంటే ఏం లేదు.
కట్ చేస్తే –
ప్రతిరోజూ వందలాదిమంది ఈ ఫీల్డులో ప్రవేశించాలని, తెరమీద కనిపించాలని, తెరవెనుక తమ టాలెంట్ చూపించాలని, సెలబ్రిటీలు కావాలని... కలలు కంటూ ఎక్కడెక్కడినుంచో ఇక్కడికి వస్తుంటారు.
అన్ని ఫీల్డుల్లాగే – ఈ ఫీల్డులో కూడా అతి తక్కువమందిని మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి. ఆకలి కేకలుంటాయి. అవమానాల గాయాలుంటాయి.
అయినా సరే – అన్నీ దిగమింగుకుంటూ రేపటి మీద ఆశతో నవ్వుతూ, తుళ్ళుతూ బ్రతుకుతుంటారు. తమ మీద తామే జోకులు వేసుకొంటూ ఎప్పటికప్పుడు ఎనర్జైజ్ అవుతుంటారు.
వీళ్లల్లో కొందరు మాత్రం రేపటి స్టార్లు, స్టార్ డైరెక్టర్లు, టెక్నీషియన్లూ అవుతారు.
మిగిలినవాళ్ళు... ఎప్పటికయినా ఏదో ఒకటి అవుతాంలే అన్న ఆశతో – యూసుఫ్ గూడా బస్తీలో, కృష్ణానగర్ గల్లీల్లో, గణపతి కాంప్లెక్స్ దగ్గరా, శ్రీనగర్ కాలనీ- ఫిలింనగర్-జుబ్లీ హిల్స్ రోడ్లల్లో... ఎవర్నీ పట్టించుకోకుండా... కుంభమేళాలో నాగసాధువుల్లా... వాళ్ల లోకంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు.
ఈ పాడ్ కాస్ట్ సినీఫీల్డుకు సంపూర్ణంగా అనుకూలం. Always for the field...
దీన్లోని ఎపిసోడ్లు ఎవర్నీ ఉద్దేశించి చేస్తున్నవి కాదు. అలాగని పూర్తిగా ఫిక్షన్ కూడా కాదు. మన గురించి మనం చెప్పుకోగల ధైర్యం, మనమీద మనమే జోకులేసుకోగల దమ్ము మనకుందని... లైటర్ వీన్ లో సరదాగా గుర్తుకుతెచ్చుకోవడం. షేర్ చేసుకోవడం.
ముఖ్యంగా... కొత్తగా ఫీల్డులోకి వచ్చేవాళ్ళకు తెలియాల్సిన బేసిక్ విషయాలు చెప్పడం. పరోక్షంగా వారి కెరీర్ ప్లానింగ్ కు ఉపయోగపడటం.
ఇంకా... వార్తలు, విశేషాలు, పాజిటివ్ టిడ్‌బిట్స్... ఇదీ అదీ అని ఏం లేదు. సినిమాకు సంబంధించిన ప్రతిఒక్కటీ ఈ పాడ్ కాస్ట్ ఫ్రేం లోకి వస్తుంది.
After all, Cinema is a battle ground...
^^^^
#FilmNagarDiaries #TeluguPodcast #Episode1 #Transcript
^^^^
#FilmNagarDiaries #TeluguPodcast #Episode1 #Transcript
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani