నా వీలునిబట్టి - అయితే నా మొబైల్‌లో రికార్డ్ చేస్తున్నాను. లేదంటే, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, నా లాపీలో రికార్డ్ చేస్తున్నాను. ఇంకో 20 ఎపిసోడ్స్ అయ్యాక గాని, మైక్రోఫోన్ ఎట్సెట్రా స్టాండర్డ్ ఇక్విప్‌మెంట్ గురించి ఆలోచించొద్దని ముందే అనుకున్నాను.
ఇంట్లో మూడు బెడ్రూములున్నా... నేను పాడ్‌కాస్ట్ రికార్డ్ చెయ్యాలనుకున్నప్పుడే నాకు ఒక్క రూం దొరకడం లేదు! హాల్లో సోఫాలో కూర్చొని రికార్డ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎవరొస్తారో, ఏ సౌండ్ డిస్టర్బ్ చేస్తుందో అని అదొక టెన్షన్!!
బహుశా ఇలాంటి పరిస్థితి ఉన్నందుకేనేమో - ఎపిసోడ్ మొత్తం రియల్ టైమ్‌లో... సింగిల్ టేక్‌లో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పటివరకు చేసిన 5 ఎపిసోడ్లూ ఇలాగే హడావిడిగానే ముగించేశాను.
కట్ చేస్తే -
నేను నా పాడ్‌కాస్ట్‌లో ఇప్పటివరకు గమనించిన చిన్న చిన్న అంశాలు (నేను సరి చేసుకోవల్సినవి, ప్లాన్ చేసుకోవల్సినవి) ఇవి:
> కంటెంట్ ఎట్టిపరిస్థితుల్లో 5 నిమిషాలు దాటకూడదు.
> ఫ్రీగా ఓ గంటపాటు నా వాయిస్ లెవల్, మాడ్యులేషన్ బాగా స్టడీ చేసి, ఒక స్టయిల్‌కు ఫిక్స్ అయిపోవాలి.
> ఎవరేమనుకుంటారో అని ఆలోచించటం పూర్తిగా మానేసి - అనుకున్న టాపిక్ చేసేసుకొంటూ వెళ్లాలి.
> ఈ డిసెంబర్ నాటికి కనీసం ఒక 100 ఎపిసోడ్స్ చెయ్యాలి. పాడ్‌కాస్ట్ పాపులర్ కావడం అనేది 100% ఆర్గానిక్‌గానే జరగాలి.
పాడ్‌కాస్ట్ చేయటం అంత ఈజీ ఏం కాదు. అలాగని, మరీ అంత కష్టం కూడా కాదు.
ManuTime.
A Podcast by Manohar Chimmani.
Link: https://anchor.fm/manohar-chimmani3
పాడ్‌కాస్ట్ చేయటం అంత ఈజీ ఏం కాదు. అలాగని, మరీ అంత కష్టం కూడా కాదు.
ManuTime.
A Podcast by Manohar Chimmani.
Link: https://anchor.fm/manohar-chimmani3
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani