ఏదన్న మనసుల బాధ వుంటె బయటపడెయ్యాలె.
షిఫ్ట్ డిలీట్!
అట్ల చెయ్యకుండ, అన్ని లోపల్లోపల్నె పెట్టుకొంటెనె... గీ గుండెపోటు, షుగర్, బీపీలు వచ్చేది. ఎక్కడిదక్కడె ఆగిపోయేది.
అంత రిస్కు ఎందుకని అప్పుడప్పుడు గీ బ్లాగుల బయటపడుతుంటాను. ఏది పడితె అది రాస్తుంటాను. ఏది లోపల్నుంచి తన్నుకొస్తుంటె అది బయటపడేస్తుంటాను.
అందుకే ఇప్పటికీ నా జోలికి ఏ రోగం రాలేదు.
అంత రిస్కు ఎందుకని అప్పుడప్పుడు గీ బ్లాగుల బయటపడుతుంటాను. ఏది పడితె అది రాస్తుంటాను. ఏది లోపల్నుంచి తన్నుకొస్తుంటె అది బయటపడేస్తుంటాను.
అందుకే ఇప్పటికీ నా జోలికి ఏ రోగం రాలేదు.
అందుకే... నా బ్లాగంటే నాకిష్టం.
బ్లాగింగ్ బంద్ చేద్దమని ఎన్నిసార్లో అనుకున్న. "ఇగ బ్లాగ్ బంద్" అని పోస్టులు కుడ పెట్టిన. కని, మళ్ల తిరిగి తిరిగి ఈడికే వచ్చిన.
బ్లాగింగ్ బంద్ చేద్దమని ఎన్నిసార్లో అనుకున్న. "ఇగ బ్లాగ్ బంద్" అని పోస్టులు కుడ పెట్టిన. కని, మళ్ల తిరిగి తిరిగి ఈడికే వచ్చిన.
నా బ్లాగ్ నా ఊపిరి. నా యోగా. నా మెడిటేషన్. నా ప్రయోగశాల. నా తప్పొప్పుల బోను. నా స్ట్రెస్ బస్టర్.
కట్ చేస్తె -
జీవితంల పైకొచ్చిన ప్రతి మనిషి వెనుక ఎన్నో బాధలుంటై. ఎంతో మంది మిత్రులు, శత్రువులతోటి అనుభవాలుంటై. వాళ్ళూ వీల్ళ్లూ అని లేకుంట - అందరూ నేర్పిన పాఠాలుంటై.
బాగుపడ్డా, పైకొచ్చినా... ఒక్కటే ఒక్క ట్రిగ్గరింగ్ వ్యక్తి ప్రభావం తప్పక ఉంటది.
నా లైఫ్‌ల అట్లాంటి మనుషుల సంఖ్య కొంచెం ఎక్కువే అనిపిస్తది. అన్నీ యాదికొస్తయి. ఏం చెయ్యగలం? ఆ యాదికొచ్చేవాట్నే పట్టుకొని బాగుపడలేం కదా! మర్చిపోవాలె. ఇప్పుడదే చేస్తున్న. కని, అవి నాకు నేర్పిన పాటాలను అస్సలు మర్చిపోలేం. మర్చిపోవద్దు. మర్చిపోతె మల్లదే తప్పు చేస్తం.
పాజిటివ్ సైడు... ఒక్కటే ఒక్క మెసేజ్‌తోటి నన్నూ, నా జీవితాన్ని ఇంద్రధనుస్సు ఎక్కించి జారుడు బల్ల ఆడించిన వ్యక్తులున్నరు. ఒక్కటే ఒక్క ఫోన్ కాల్‌తోటి నన్ను నేను మర్చిపోయిన నన్నులాగ మార్చినవాళ్లున్నరు.
వాళ్ళు నాతోటి జీవితాంతం ఉండకపోవచ్చు. కని, వాళ్ళిచ్చిన మంచి జ్ఞాపకాలు మాత్రం కొసాకరి దాక నాతోనే ఉంటై.
ఇసొంటి మంచిని యాది చేసుకొనుడే నాకు చానా ఇష్టం. చానా మంచిది.
అప్పుడప్పుడు, నేను పుట్టి పెరిగిన, చిన్నప్పుడు తిరిగిన... నా వరంగల్ భాషల... గిట్ల పోస్టులు పెట్టుకుంటె గుడ మస్తుంటది!
అప్పుడప్పుడు, నేను పుట్టి పెరిగిన, చిన్నప్పుడు తిరిగిన... నా వరంగల్ భాషల... గిట్ల పోస్టులు పెట్టుకుంటె గుడ మస్తుంటది!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani