చలం "మ్యూజింగ్స్" పుస్తకం చదివినప్పటి నుంచి నాకు మ్యూజింగ్స్ అన్న పదం తెలుసు. సుమారు 90 ఏళ్ళ క్రితం ఈ పుస్తకం రాశారు చలం గారు.
యూట్యూబ్‌లో వీడియో షోల కంటే కూడా - ఆడియో పాడ్‌కాస్ట్‌లకే ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యం, విలువ ఉంది.
అమెరికా వంటి దేశాల్లో పాడ్‌కాస్ట్‌కు ఎక్కువ విలువిస్తారు.
అమెరికా వంటి దేశాల్లో పాడ్‌కాస్ట్‌కు ఎక్కువ విలువిస్తారు.
వీడియో అయితే చూస్తూ వినాలి. పాడ్‌కాస్ట్ అయితే డ్రైవింగ్ చేస్తూ, సైక్లింగ్ చేస్తూ, రన్నింగ్ చేస్తూ, నడుస్తూ ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని... చివరికి అలా పడుకొని కూడా వినొచ్చు. అదీ దీని ప్రధాన సౌలభ్యం.
కట్ చేస్తే -
నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి నా మనసు పాడ్‌కాస్ట్ మీద పడింది. "ఫిలింనగర్ డైరీస్" పేరుతో ఒక 3 పైలట్ ఎపిసోడ్స్ చేశాను. రెస్పాన్స్ బాగానే ఉంది.
అయితే - నా పాడ్‌కాస్ట్‌ను కేవలం సినిమాలకే పరిమితం చేయడం ఇష్టం లేదు. క్రియేటివిటీ, లైఫ్‌కు సంబంధించిన అన్ని ఎఫెక్టివ్ టాపిక్స్ మీద కూడా పాడ్‌కాస్ట్ ఎపిసోడ్స్ చేయాలనుకుంటున్నాను.
సో, ఇప్పుడు పాడ్‌కాస్ట్ పేరు మార్చాలి...
సో, ఇప్పుడు పాడ్‌కాస్ట్ పేరు మార్చాలి...
"మనూటైమ్ మూవీ మిషన్" పేరుతో నాకు ప్రొడ్యూసర్‌గా తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో లైఫ్ మెంబర్‌షిప్ ఉంది. అంతకు ముందు నేను ప్రచురించిన నా పుస్తకాలు కూడా "మనూటైమ్ కమ్యూనికేషన్స్" అనే నా ప్రొప్రయిటరీ ఫర్మ్ ద్వారా ప్రచురించాను.
సో, ఇప్పుడు నా పాడ్‌కాస్ట్ టైటిల్ చిన్నగా, క్యాచీగా ఉండాలి కాబట్టి, నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఇదే - "మనూ టైమ్".
"మనోహర్ మ్యూజింగ్స్" అని పెడదామా అనుకున్నాను. అయితే - మ్యూజింగ్స్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. పూరి మ్యూజింగ్స్, రోజా మ్యూజింగ్స్, ఎట్సెట్రా చాలా మ్యూజింగ్స్ ఉన్నాయి ఇప్పటికే.
చలం మ్యూజింగ్స్ నేపథ్యంలో, మ్యూజింగ్స్ అనే పదం నాకు చాలా ఇష్టమే అయినా, ఇప్పటికే ఉన్న ఎన్నో మ్యూజింగ్స్‌లో నాదొకటి కలిసిపోకూడదని నా పాడ్‌కాస్ట్‌కు ఈ పేరు పెట్టాను -
MANU TIME!
చలం మ్యూజింగ్స్ నేపథ్యంలో, మ్యూజింగ్స్ అనే పదం నాకు చాలా ఇష్టమే అయినా, ఇప్పటికే ఉన్న ఎన్నో మ్యూజింగ్స్‌లో నాదొకటి కలిసిపోకూడదని నా పాడ్‌కాస్ట్‌కు ఈ పేరు పెట్టాను -
MANU TIME!
పేరుదేముంది... అసలు పాడ్‌కాస్ట్‌లో విషయముంటే ఏ పేరయినా పాపులర్ అవుద్ది.
సో, నా ఫోకస్ అంతా కంటెంట్ మీదే ఇక.
సో, నా ఫోకస్ అంతా కంటెంట్ మీదే ఇక.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani