మనం ఒకరికి సహాయం చేయకపోయినా ఫరవాలేదు. అది మన ఇష్టం. దాన్ని తప్పుపట్టడానికి లేదు.
ఒక సింపుల్ "నో" చాలు.
కాని - మన ఈగోతో, మన లాజిక్స్‌తో అవతలివారిని మాటలతో హర్ట్ చేయటం తప్పు.
ఒక సింపుల్ "నో" చాలు.
కాని - మన ఈగోతో, మన లాజిక్స్‌తో అవతలివారిని మాటలతో హర్ట్ చేయటం తప్పు.
మన ఫౌండేషన్‌ను మనం మర్చిపోవద్దు. అది మనస్థాయిని తెలుపుతుంది.
నా రూట్స్‌ను నేను మర్చిపోలేను. నా జీవితంలోని ప్రతి దశలోనూ, వివిధ విషయాల్లో నాకు తోడ్పడిన ప్రతి చిన్నా పెద్దా సహాయాన్ని, మోరల్ సపోర్ట్‌ను నేను మర్చిపోలేదు. ఆయా సందర్భాలపట్ల, ఆయా వ్యక్తుల పట్ల నా కృతజ్ఞతా భావం నా చివరి శ్వాసవరకూ ఎవర్‌గ్రీన్.
వీరందరి పట్లా నా బాధ్యత కూడా అనుక్షణం నాకు గుర్తుంటుంది.
వీరందరి పట్లా నా బాధ్యత కూడా అనుక్షణం నాకు గుర్తుంటుంది.
నేను ఏ స్థాయిలోనైనా ఉండొచ్చు. అవసరమైనప్పుడు నేను వారికి సహాయం చేయలేకపోవచ్చు. లేదా, చేసే అవకాశం లేకపోవచ్చు. కాని, మాటలతో వారిని బాధపెట్టే శుష్కమైన పని మాత్రం నేను చేయను. చేయలేను. అది నా వ్యక్తిత్వం కాదు.
కట్ చేస్తే -
మనం చేసిన కొన్ని సహాయాలు కొందరు వ్యక్తుల జీవితాల్నే మార్చివేస్తాయి. దాని విలువ గుర్తించలేని వారిని, గుర్తించటం ఇష్టం లేనివారిని మనం పెద్దగా పట్టించుకోనవసరంలేదు.
తిరిగి వారి నుంచి ఏదో ఆశించి కాదు, వారికి మనం అలాంటి సహాయం చెయ్యటం.
అది మన వ్యక్తిత్వం.
అలాంటి సహాయం అందుకున్నవారి వ్యక్తిత్వం కూడా మనం ఊహించిన స్థాయిలో ఉండాలనుకోవటం మాత్రం మన తప్పు.
And... Life never stops teaching.
And... Life never stops teaching.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani