"ఏంటి సర్... మీరేమో ఎప్పుడూ యూత్‌ఫుల్‌గా ఉంటారు. పోను పోను మీ పోస్టులేంటి మరీ అంత చప్పగా ఉంటున్నాయి ఈ మధ్య?"
మొన్నొకరోజు ఒక మీటింగ్‌లో కూర్చున్నప్పుడు ఒక మిత్రుడు ఈ మాటన్నాడు.
నా చుట్టూ 101 టెన్షన్స్, రకరకాల రూపాల్లో నన్ను బంధించివేసిన నిజం నా మిత్రునికి బాగా తెలుసు.
గత 18 నెలలుగా కోవిడ్ లాక్‌డౌన్, దానికి సంబంధించిన ఇతరత్రా భయాలు కూడా తోడయ్యాయి.
మొన్నొకరోజు ఒక మీటింగ్‌లో కూర్చున్నప్పుడు ఒక మిత్రుడు ఈ మాటన్నాడు.
నా చుట్టూ 101 టెన్షన్స్, రకరకాల రూపాల్లో నన్ను బంధించివేసిన నిజం నా మిత్రునికి బాగా తెలుసు.
గత 18 నెలలుగా కోవిడ్ లాక్‌డౌన్, దానికి సంబంధించిన ఇతరత్రా భయాలు కూడా తోడయ్యాయి.
నాకు కూడా కోవిడ్ వచ్చిందీ, పోయింది. పోస్ట్ కోవిడ్ సమస్యలు కూడా బాగానే ఇబ్బందిపెట్టాయి. మొత్తానికి ఓ పునర్జన్మలా ఇప్పటికి బయటపడ్డాం.
నా సోషల్ మీడియా పోస్టుల గురించి ఆ క్షణం నా మిత్రుడు అన్నది సరదాగానే కాని, నేను మాత్రం కొంచెం సీరియస్‌గానే ఆలోచించాను దీని గురించి. ఆ మీటింగ్ జరుగుతుండగానే ఓ అయిదు నిమిషాలపాటు ఆలోచించాను. ఆ తర్వాత రోజు కూడా గుర్తుకొచ్చింది.
ఇదుగో, ఇప్పుడే అట్లీ తమిళ సినిమా ఒకటి చూడ్డం ముగించి, ఈ పోస్టు రాస్తున్నాను.
ఇదుగో, ఇప్పుడే అట్లీ తమిళ సినిమా ఒకటి చూడ్డం ముగించి, ఈ పోస్టు రాస్తున్నాను.
కట్ చేస్తే -
సోషల్ మీడియా అనేది నా దృష్టిలో ఒక మంచి మల్టిపర్పస్ టూల్. ఒక పెద్ద స్ట్రెస్ బస్టర్ కూడా. దీన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారన్నది వారి వారి అవగాహన మీద, అవసరం మీద ఆధారపడి ఉంటుంది.
పూర్తిగా వ్యక్తిగతం.
పూర్తిగా వ్యక్తిగతం.
ఎవరి గోల వారిది. ఎవరి వాల్ వారిది.
ఇంకొకరిని వ్యక్తిగతంగా ఎఫెక్టు చేయనంతవరకు... ఆల్ ఓకే.
ఇంకొకరిని వ్యక్తిగతంగా ఎఫెక్టు చేయనంతవరకు... ఆల్ ఓకే.
నువ్విలాగే పోస్టులు పెట్టాలి అని కాని, నేను చూస్తున్నప్పుడు నాకిలాంటి పోస్టులే కనిపించాలనిగాని అనుకోవడం సోషల్‌మీడియాలో కుదరని పని.
నా మటుకు నేను సోషల్ మీడియాలో రోజుకు ఒక 30-40 నిమిషాలు గడుపుతాను. అదీ ముక్కలు ముక్కలుగా!
ఆ టైమ్‌లో, నా ఫీడ్‌లో కనిపించేవాటిల్లో నాకిష్టమైనవి చూస్తాను. లేదా, నేరుగా నాకిష్టమైన కొందరి టైమ్‌లైన్‌కు వెళ్ళిపోతాను.
ఆ క్షణం నాకు ఏదైనా పోస్ట్ చేయాలనిపిస్తే చేస్తాను. బ్లాగ్ రాయాలనిపిస్తే రాస్తాను. ఇదంతా ఒక ప్లానింగ్ లేకుండా, ఏదో ఒక టైమ్‌లో చకచకా జరిగిపోయే పని.
జీవితం చాలా చిన్నది. మన డొమెయిన్‌లో మన ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు.
జీవితం చాలా చిన్నది. ఇలాగే బ్రతకాలన్న రూలేం లేదు.
జీవితం చాలా చిన్నది. ఇలాగే బ్రతకాలన్న రూలేం లేదు.
మన ఆలోచనల్లోనే వంద వైరుధ్యాలుంటాయి. ఒక గీత గీసినట్టు బ్రతకలేం. అలా బ్రతికేది జీవితం కాదు.
సోషల్ మీడియా ఒక ఊహా ప్రపంచం. ఒక యుటోపియా. ఒక మార్కెటింగ్ టూల్.
ఇక్కడ కూడా మన పరిస్థితులు, మన మానసికస్థితి, మన సోషల్ స్టేటస్ ప్రతిబింబించాల్సిన అవసరం లేదు. మన జీవితంలో జరుగుతున్న ప్రతివిషయాన్నీ ఇక్కడ లాగింగ్ చేసుకోవాల్సిన అవసరంలేదు. ఇలాంటి పోస్టులు పెడితే... ఇలాంటి బ్లాగులు రాస్తే ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించాల్సిన అవసరం కూడా అసలు లేదు.
నచ్చినవాళ్లు చూస్తారు. నచ్చినవాళ్ళు జంప్ అయిపోవచ్చు. మరీ ఇబ్బందికరంగా అనిపిస్తే, ఇంకోసారి మన పోస్టులు కనిపించకుండా మనల్ని అన్‌ఫ్రెండ్ చెయ్యొచ్చు. అవసరమైతే బ్లాక్ చెయ్యొచ్చు. ఎవ్వరూ ఎవ్వర్ని ఫోర్స్ చెయ్యరు.
కట్ చేస్తే -
నా మిత్రుడు చెప్పింది నిజమే...
మన లైఫ్ లోని సీరియస్‌నెస్ అంతా మన పోస్టుల్లో రిఫ్లెక్ట్ కావల్సిన అవసరం లేదు... ఎవరో ఏదో అనుకుంటారని మన ఊహాలోకానికి కూడా మాస్క్ వేసుకోవాల్సిన అవసరంలేదు. దేని ట్రాక్ దానిదే.
సోషల్ మీడియా అనేది ముందు మన కోసం. మనల్ని ఇష్టపడే మన మిత్రులకోసం. మిగిలిన భయాలన్నీ ఉట్టి బుల్ షిట్.
Everyone has three lives: a public life, a private life, and a secret life.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani