నిజంగా సత్తా ఉంటే - సరైనవిధంగా ఉపయోగించుకోగలిగితే - ఫేస్‌బుక్ ఒక్కటి చాలు. మన ఓపికను బట్టి, మన సౌకర్యాన్ని బట్టి, మనం వెచ్చించగలిగే సమయాన్ని బట్టి... ఫేస్‌బుక్, ట్విట్టర్ రెండూ ఉపయోగించుకోవచ్చు.
సోషల్‌మీడియాలో ఎన్నో ఉన్నాయి కదా ఫ్రీగా అని, అవన్నీ ఉపయోగించాలన్న రూలేం లేదు.
సెలబ్రిటీలకు ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ ఉపయోగం. అలాగని హీరోహీరోయిన్స్ అందరికీ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్స్ లేవు. కొందరు కేవలం ట్విట్టర్ వాడతారు, కొందరు ఫేస్‌బుక్ ఒక్కటే ఉపయోగిస్తారు.
ఈ మధ్య ట్విట్టర్ స్పేసెస్, క్లబ్ హౌజ్ బాగా పాపులర్ అయ్యాయి. కనీసం నేను వాటికి కనెక్ట్ అవ్వలేకపోయాను. మార్కెటింగ్‌కి క్లబ్ హౌజ్ బాగానే ఉపయోగపడుతుంది. కాని, ఎందుకో కనెక్ట్ కాలేకపోయాను. అంత ఆసక్తి కలగలేదు.
యూట్యూబ్ చానెల్ ఒకటి ప్రారంభించి, నా ఊహల్లో ఉన్న ఒక షో చెయ్యాలని ఆ మధ్య అనుకున్నాను. కాని, ఎందుకో చివరి నిముషంలో మానుకున్నాను. ఆడియో పాడ్‌కాస్ట్ కూడా చెయ్యాలనుకున్నాను. తర్వాత వద్దనుకున్నాను.
నిజానికి ఈ రెండూ నేను బాగా చేయగలను. కొత్తదనంతో కూడిన కంటెంట్ క్రియేట్ చెయ్యటం నాకు పెద్ద సమస్య కాదు. కాని దానికి అనుబంధంగా మళ్ళీ నేనొక టీమ్ మెయింటేన్ చెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది నా వల్ల కాని పని. డబ్బు ఒక్కటే కాదు సమస్య. వారిని కో-ఆర్డినేట్ చెయ్యటం, లీడ్ చెయ్యటం... ఇదంతా చాలా సమయంతో కూడుకొన్న పని.
కాని, నాకైతే ఆ ఆలోచన ఉంది. చెయ్యటం అవసరం కూడా.
కట్ చేస్తే -
జేమ్స్ ఆల్టుచర్, టిమ్ ఫెర్రిస్, మేరీ ఫోర్లియో వంటివారి షోలు, పాడ్‌కాస్ట్‌లు చూసినప్పుడు నాకూ ఆ స్థాయి షోలు, పాడ్‌కాస్ట్‌లు చెయ్యాలనిపిస్తుంది.
ఏదైనా టీవీ చానెల్ నుంచి గాని, పాపులర్ యూట్యూబ్ చానెల్ నుంచి గాని - నేను అనుకుంటున్న స్థాయిలో ఏదైనా ఆఫర్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. అంత రిసెర్చ్ చెయ్యగలను, అంత బాగా చెయ్యగలను.
ఇది ఓవర్ కాన్‌ఫిడెన్స్ కాదు. ప్యాషన్. ఇష్టం.
ఓటీటీ కోసం కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లో ఉన్నాను. ముందు ఆ ట్రాక్ త్వరగా కదలాలి. రీజనబుల్ టర్మ్స్‌లో ఒక లైక్-మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్ కోసం నా అన్వేషణ ఇంకా పూర్తికాలేదు. అదొక్కటి అయితే చాలు. తర్వాత ఇలాంటివన్నీ అవే కదుల్తాయి.
ఒక సక్సెస్‌ఫుల్ ఫ్రీలాన్సర్‌కు సగటున 7 ఆదాయ మార్గాలుంటాయట!
ఈ విషయంలో నేనింకా చాలా ఎదగాల్సి ఉంది.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani