మొత్తానికి ఇవ్వాళ నా పాడ్‌కాస్ట్ తొలి ఎపిసోడ్ అప్‌లోడ్ చేశాను.
టిమ్ ఫెర్రిస్ పాడ్‌కాస్ట్ వింటున్నప్పటి నుంచి అనుకొంటూనే ఉన్నాను, నేనూ ఓ పాడ్‌కాస్ట్ చెయ్యాలని. సుమారు నాలుగేళ్లయినా ఆ పనిచేయలేకపోయాను.
పాడ్‌కాస్ట్, షోలు చాలా అవసరమని చెప్తూ ఆ మధ్యనే ఒక బ్లాగ్ రాశాను. కాని, పాడ్‌కాస్ట్ మాత్రం ప్రారంభించలేకపోయాను.
రెండు రోజుల క్రితం మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర ఉన్నట్టుండి ఒక మెసేజ్ పెట్టాడు... మీరు పాడ్‌కాస్ట్ స్టార్ట్ చెయ్యండి అని.
ముందు సగంలో ఉన్న మన సినిమా డీల్స్ సంగతి తేలనీ అన్నాను. తర్వాత, "చేద్దాంలే... ఇప్పటికిప్పుడు దానివల్ల మనకు జాక్‌పాట్ ఏదన్నా వచ్చేదుందా" అన్నట్టు మాట్లాడాను.
ముందు సగంలో ఉన్న మన సినిమా డీల్స్ సంగతి తేలనీ అన్నాను. తర్వాత, "చేద్దాంలే... ఇప్పటికిప్పుడు దానివల్ల మనకు జాక్‌పాట్ ఏదన్నా వచ్చేదుందా" అన్నట్టు మాట్లాడాను.
"జాక్‌పాట్ ఏం రాదు గాని, ఆ బ్లాగ్‌లో రాసేదేదో పాడ్‌కాస్ట్‌లో చెప్పండి" అన్నాడు ప్రదీప్.
పాయింటే!
కీబోర్డ్ బాగానే రిఫ్రెష్ అయ్యిందనుకున్నాను.😊
కాని, అది ప్రదీప్ చెప్పినంత ఈజీ కాదు. మొబైల్‌లో చెయ్యాలా? లాపీలో చెయ్యాలా? ఏది ఈజీ? ఆర్ట్ వర్క్ నాకు పెద్ద కష్టం కాదు. నేను చెయ్యగలను. కాని, ఎడిటింగ్ అవన్నీ ఎట్లా... ఇదంతా ఇప్పుడు కష్టంలే అనుకున్నాను.
ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది.
కట్ చేస్తే -
థాంక్స్ టు జేమ్స్ ఆల్టుచర్ - ఎవరు ఈ ఫీల్డులో ఉన్నా, ఏ పనిచేస్తున్నా... పనిచేసేవాడైనా, పనిదొంగయినా... కనీసం ఒక అయిదేళ్లకోసారి "రీ-ఇన్వెంట్" అవ్వాలి అంటాడతను.
నిన్న రాత్రి గట్టిగా అనుకున్నాను... ఈమాత్రం దానికి ఇన్నేళ్ళుగా వాయిదా వేస్తూరావడం నాకే నచ్చలేదు. అంతకుముందెప్పుడో బ్లాగ్‌లో పెట్టడానికి కాన్వాలో చేసుకున్న డిజైన్ తీసి డెస్క్‌టాప్ మీద రెడీగా పెట్టుకున్నాను. పాడ్‌కాస్ట్ ఎలా చేయాలి, ఏంటి అనేది ఓ గంటసేపు స్టడీ చేసి పడుకున్నాను.
ఇవ్వాళ మధ్యాహ్నం మా బాల్కనీవైపున్న బెడ్రూంలోకెళ్ళి తలుపులేసుకున్నాను. నా మొట్టమొదటి పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ సింగిల్ టేక్‌లో రికార్డ్ చేశాను.
మొదటిసారి కాబట్టి అనుకుంటాను, కొంచెం డల్‌గా ఉంది. అక్కడక్కడా తడబాట్లున్నాయి. సరైన మాడ్యులేషన్ లేదు. వాయిస్‌లో ఉండాల్సినంత కాన్‌ఫిడెన్స్ లేదు. అయినాసరే, అదే సేవ్ చేశాను. ఎడిటింగ్ అదీ లేకుండానే "రా" ఆడియో ఫైల్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మిక్స్ చేసి అప్‌లోడ్ చేసేశాను.
ముందు బండి కదలటం ముఖ్యం. పర్‌ఫెక్షన్ తర్వాత.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani