సినిమా ఫీల్డు అంటే అందరికీ చిన్న చూపు ఉంటుంది. అందరూ తిడతారు, సెటైర్లు వేస్తారు, నానా చెత్త మాట్లాడతారు. కాని, ప్రపంచంలో ఏ ఫీల్డు అయినా సినిమా ఫీల్డు లాంటిదే.
ఇక్కడుండే అన్‌సర్టేనిటీ ప్రతి ఫీల్డులోనూ ఉంటుంది. ఇక్కడుండే లాభనష్టాలు కూడా అన్ని ఫీల్డుల్లో ఉండేవే. బయటి ఫీల్డుల్లో జరగని తప్పులు, రాజకీయాలేవీ ఇక్కడ జరగవు.
ఒప్పుకోడానికి ఇష్టం ఉండదు అంతే.
ఇక్కడుండే అన్‌సర్టేనిటీ ప్రతి ఫీల్డులోనూ ఉంటుంది. ఇక్కడుండే లాభనష్టాలు కూడా అన్ని ఫీల్డుల్లో ఉండేవే. బయటి ఫీల్డుల్లో జరగని తప్పులు, రాజకీయాలేవీ ఇక్కడ జరగవు.
ఒప్పుకోడానికి ఇష్టం ఉండదు అంతే.
అందరూ ఈ ఫీల్డు మీద పడి అరవటానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే – ఇక్కడ గ్లామర్ ఉంది. సెలబ్రిటీ స్టేటస్ ఉంది. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా బ్రేకింగ్ న్యూస్ అవుద్ది. అంతకంటే పెద్ద చీమలు బయట వంద గుటుక్కుమన్నా అసలు పట్టించుకోరు. ఇదొక్కటే తేడా. ఇంతకంటే ఏం లేదు.
కట్ చేస్తే –
ఫిలింనగర్ అంటేనే సినిమా. అదో మరో ప్రపంచం. ప్రతిరోజూ వందలాదిమంది ఈ ఫీల్డులో ప్రవేశించాలని, తెరమీద కనిపించాలని, తెరవెనుక నగిషీలు చెక్కాలని, సెలబ్రిటీలు కావాలని కలలు కంటూ ఎక్కడెక్కడినుంచో ఇక్కడికి వస్తుంటారు.
అన్ని ఫీల్డుల్లాగే – ఈ ఫీల్డులో కూడా అతి తక్కువమందిని మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి. ఆకలి కేకలుంటాయి. అవమానాల గాయాలుంటాయి. అప్పుల బాధలుంటాయి. ఆత్మహత్యల గాథలుంటాయి.
అయినా సరే – అవన్నీ దిగమింగుకుంటూ రేపటి మీద ఆశతో నవ్వుతూ, తుళ్ళుతూ బ్రతుకుతుంటారు. తమ మీద తామే జోకులు వేసుకొంటూ ఎప్పటికప్పుడు ఎనర్జైజ్ అవుతుంటారు.
వీళ్లల్లో కొందరు మాత్రం రేపటి ఆర్టిస్టులు, స్టార్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లూ, అసిస్టెంట్లూ అవుతారు. మిగిలినవాళ్ళు ఎప్పటికయినా ఏదో ఒకటి అవుతామన్న అశతో – యూసుఫ్ గూడా బస్తీలో, గణపతి కాంప్లెక్స్ చుట్టూరా, శ్రీనగర్ కాలనీ- ఫిలింనగర్-జుబ్లీ హిల్స్ రోడ్లల్లో... ఎవర్నీ పట్టించుకోకుండా... కుంభమేళాలో నాగసాధువుల్లా వాళ్ల లోకంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు.

ఈ నేపథ్యంలో నేనొక లైటర్‌వీన్ మైక్రో కథల సీరీస్ రాస్తున్నాను.
ఫిలింనగర్ డైరీస్!
ఫిలింనగర్ డైరీస్!
మనోహరమ్ మ్యాగజైన్‌లో వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న ఈ మైక్రో కథలను నా బ్లాగ్‌తో పాటు, ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేస్తాను.
ఇవి ఎవర్నీ ఉద్దేశించి రాస్తున్నవి కాదు. అలాగని ఊహించి రాస్తున్నవి కూడా కాదు. జస్ట్ ఫర్ ఫన్. మనమీద మనమే జోకులేసుకోగల సత్తా కూడా మనకుందని గుర్తుకుతెచ్చుకోవడం. గౌరవ సీనియర్లూ, ప్రియమైన జూనియర్లూ-కొత్తవాళ్ళూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం.
అలాగే, మీరు కూడా... 😊
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani