ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, కూ, మనోహరమ్ మ్యాగజైన్, ఈ బ్లాగ్... మొట్టమొదటిసారిగా వీటన్నిటినీ వంద శాతం ప్రొఫెషనల్‌గా ఉపయోగిస్తున్నాను.
బాటమ్‌లైన్ మాత్రం మారదు - అన్నీ కలిపి మొత్తం ఒక గంట కంటే ఎక్కువ టైమ్ తీసుకోలేను.
క్లబ్ హౌజ్‌లోకి కూడా ఎంటరవ్వాలని ఉంది. కుదరట్లేదు. టార్గెటెడ్ కాంటాక్ట్స్ చాలా ముఖ్యం. ఈ కోణంలో క్లబ్ హౌజ్ కొంతవరకు ఉపయోగపడొచ్చని నా అంచనా. ఇంతవరకు ఎప్పుడూ పాల్గొనలేదు. పూర్తిగా దిగిపోయాను కాబట్టి, అది కూడా వన్ ఫైన్ నైట్ జరుగుతుంది.
ఫిలింనగర్ డైరీస్ తృతీయ పురుషలో (థర్డ్ పర్సన్) రాయటం ప్రారంభించాను. కాని, నాకే నచ్చటం లేదు. తర్వాతి మైక్రో కథ నుంచి, అన్ని కథలూ ఉత్తమ పురుష (ఫస్ట్ పర్సన్) లో ఉంటాయి.
కథలుగా అన్నీ కల్పితాలే. కాని, నిజాలు.
సరిగా 9 ఏళ్లక్రితం ఈ బ్లాగ్ ప్రారంభించినప్పుడు ఏ థీమ్ అయితే ఉపయోగించానో, ఇప్పుడు మళ్ళీ అదే థీమ్‌కు మార్చాను.
చాలా విషయాల్లో, ఈ ఆగస్టు నుంచి పూర్తిగా ఒక అప్‌సైడ్ డౌన్ మార్పు కోసం తీవ్రంగా పనిచేస్తున్నాను. ఫలితాలు ఆటోమాటిగ్గా ఫాలో అవుతాయి.
కట్ చేస్తే -
కట్ చేస్తే -
ఎంత పెద్ద సినిమా చేస్తున్నామన్నది కాదు పాయింట్. అసలు సినిమా అంటూ చేస్తూ ఉండటం ముఖ్యం. ఎప్పుడూ పనిలో ఉండటం ముఖ్యం. లైమ్‌లైట్‌లో ఉండటం ముఖ్యం. ప్రస్తుతం ఆ పనిలోనే బిజీగా ఉన్నాను.
YOU CAN MAKE MORE FRIENDS IN TWO MONTHS BY BECOMING INTERESTED IN OTHER PEOPLE THAN YOU CAN IN TWO YEARS BY TRYING TO GET OTHER PEOPLE INTERESTED IN YOU.
~ DALE CARNEGIE
~ DALE CARNEGIE
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani