ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే, ఏదైనా సరే చెయ్యడానికి టైం దొరక్కపోవడమనేది ఉండదు. మనం రిచర్డ్ బ్రాన్సన్, జెఫ్ బెజోస్, ఈలన్ మస్క్‌ల కంటే బిజీగా ఏం లేము.
మనం వారికంటే బాగా ఏం సంపాదించడంలేదు. జీవితాన్ని కూడా వారికంటే బాగా ఏం ఎంజాయ్ చెయ్యటం లేదు. వారికంటే ఎక్కువగా పని కూడా ఏం చెయ్యటం లేదు మనం.
మనం ఫోన్ చెయ్యాలనుకొంటే చేస్తాం. వద్దు అనుకుంటే చెయ్యం. అంతే. ఇంక మధ్యలో మిడిల్ గ్రౌండ్ ఏమీ ఉండదు.
ప్రయారిటీలో మనముంటే అలా మర్చిపోవడం అనేది అసలుండదు. టైం అదే ఉరుక్కుంటూ వస్తుంది! That simple...
"అబ్బా... ఫోన్ చెయ్యడం మర్చిపోయాను" అంటుంటారు కొందరు. అది కూడా ఇంతే.
ప్రయారిటీలో మనముంటే అలా మర్చిపోవడం అనేది అసలుండదు. టైం అదే ఉరుక్కుంటూ వస్తుంది! That simple...
కట్ చేస్తే -
కొంతమంది మిత్రులు చెప్పే రీజన్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి.
కొంతమంది మిత్రుల్లా నటించే అవకాశవాదుల దృష్టిలో అసలు మనమెక్కడున్నామో తెలుస్తుంది. ప్రయారిటీ లిస్టులో కాదుకదా... అసలు వారి దృష్టిలో మన ఉనికే ఉండదు.
దీన్ని బట్టే, వారితో కనెక్ట్ అయి ఉన్న మన ఇతర అంచనాలు సరిచేసుకోవాలి. అవసరమైతే, అక్కడితో ముగించి, ఇక అంతే అని సరిపెట్టుకోవాలి. లేదంటే, తెలిసి తప్పుచెయ్యటమవుతుంది. జరిగే నష్టం కూడా తక్కువుండదు.
ఎవరి గోల వారిది. ఎవరి సమస్యలు వారివి.
“THE MOST IMPORTANT THING IN COMMUNICATION IS HEARING WHAT ISN’T SAID”
~ PETER DRUCKER
అందరూ చెప్పేది కాని, వారి జీవితం కాని, ఖచ్చితంగా బయటికి కనిపించేలా మాత్రం ఉండదు. జీవితంతో వారెలాంటి యుధ్ధం చేస్తున్నారో మనకేం తెలుసు?
“THE MOST IMPORTANT THING IN COMMUNICATION IS HEARING WHAT ISN’T SAID”
~ PETER DRUCKER
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani