Friday, 5 September 2025

Othello’s Whisper


కొందరిని ఒకవైపు ఎంత అత్యున్నతంగా అనుకుంటామో, ఇంకోవైపు చాలా చిన్న పిల్లల మనస్తత్వంతో, చాలా చాలా ఇమ్మెచ్యూర్‌గా ఆలోచిస్తుంటారు. 

లేనిదేదో ఊహించుకొంటుంటారు. వాళ్ళ ఊహల్లో వాళ్ళు అనుకున్నదే నిజం అనుకొని బాధపడుతుంటారు. బాధపెడ్తుంటారు. 

పోనీ, వాళ్ళు చెప్పిందే నిజం అని ఒప్పుకోడానికి అక్కడ ఏమీ ఉండదు.  శూన్యం. 

మనం చెప్పింది వినే ఓపిక ఉండదు. అసలు వినరు. వినడానికి ఈగో. అలాగని అబద్ధాల్ని నిజం అని ఒప్పుకొని మన క్యారెక్టర్ చంపుకోలేం కదా. 

దీన్ని డెల్యూజనల్ జెలసీ అందామా? ఒథెల్లో సిండ్రోమ్ అందామా? 

నీ ఊహల్లోని నిజాన్ని నువ్వు చూపించలేనప్పుడు, నిజమైన నిజాన్ని నువ్వు నమ్మగలగాలి. దానికి నీ ఈగో అడ్డురావాల్సిన అవసరం లేదు. 

ప్రేమలో ఈగోలేంటి? అసలు ఈ గోలేంటి?  

అన్నిటికీ శాస్త్రీయ కారణాలుంటాయి. ఆ విషయం మాట్లాడితే ఇంకేం లేదు. సునామీలే!  

కట్ చేస్తే - 

షేక్స్‌పియర్లు, విశ్వనాథలు, బుచ్చిబాబులు, చలంలు... వీళ్లంతా పెన్నులు మూతపెట్టి సముద్రంలోకి విసిరేసేవాళ్ళే కదా? ఇంత సాహిత్యం ఎలా పుట్టేది? అసలు సాహిత్యం పుట్టేదా?    

రచయితలు, క్రియేటివ్ పీపుల్ ఆలోచనా ప్రపంచం పూర్తిగా వేరేగా ఉంటుంది. అది అందరికీ అర్థం కాదు. 

Trust is the highest form of love. Without it, love turns into fear, doubt, and sorrow.

- మనోహర్ చిమ్మని 

Thursday, 4 September 2025

అప్పుడే 247 రోజులయిపోయాయి... ఏం సాధించాం?


2025 అయిపోడానికి ఇంక 118 రోజులే ఉన్నాయి. 
ఏం సాధించాను? 

చాలా సాధించాను...
ప్రొఫెషనల్ & బిజినెస్ అనుభవాలు చాలా ఉన్నాయి. కాని, అవన్నీ ఆశించిన ఫలితాన్ని తీసుకురాలేకపోయాయి.

ఎక్కడికక్కడ స్టకప్ అయ్యి, ఊపిరి తీసుకోని పరిస్థితులు అనుక్షణం వేధించే అంత సాధించాను. 

అయితే - ఇది నా ఒక్కడి పరిస్థితి కాదు. బిజినెస్ ప్రపంచమంతా ఉంది. కాని, దీనికి కూడా ఒక ముగింపు ఉంటుంది. ఉంది. 

కట్ చేస్తే - 

అన్నిటికన్నా ఎక్కువగా సాధించింది ఒక పెద్ద పాఠం నేర్చుకోవడం... 
ప్రాణం పోయినా సరే, ఏ తెలివితక్కువ పొరపాటు చేయవద్దో నేర్చుకున్నాను. 

కారణం లేకపోయినా, తప్పు లేకపోయినా, ఎదుటివారు మనల్ని అత్యంత చులకనగా ఎంతమాట పడితే అంత మాట అనగల స్థితిలో మనం ఉండకూడదన్న కఠిన వాస్తవం తెలుసుకున్నాను.  

దీనిలో కూడా నేను తీసుకొనే పాజిటివ్ సజెషన్ ఒకటుంది. పరోక్షంగా, ఇంకొకరి ద్వారా, ఇంత బాగా నన్ను వేధిస్తే తప్ప నన్ను నేను పూర్తిగా మార్చుకోలేనని కావచ్చు... ఆ దేవుడి సంకల్పం. 

అయినా సరే - 

One cannot have the right to assassinate the character of someone who respects them deeply — especially without reason, in a meaningless way, again and again. 

- మనోహర్ చిమ్మని