అసలు రివ్యూస్ అనేవి అసంబద్ధం. అనవసరం కూడా.
ఒక సినిమాపైనో, ఒక డైరెక్టర్ పైనో, ఒక హీరో పైనో... తమ వ్యక్తిగతమైన అభిప్రాయాలను, అసూయను, వ్యతిరేకతను బాహాటంగా వ్యక్తీకరించడానికి... (రివ్యూలు రాయడమనేది) సోకాల్డ్ రివ్యూయర్స్‌కు ఒక మంచి అవకాశం.
ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసే వ్యక్తిగత దాడి.
సబ్జెక్టివ్ ఎటాక్.
ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసే వ్యక్తిగత దాడి.
సబ్జెక్టివ్ ఎటాక్.
రివ్యూయర్స్‌లో సినిక్స్, శాడిస్టులే ఎక్కువ అనిపిస్తుంది.
అరుదుగా కొందరు రివ్యూయర్స్ మాత్రం స్టాండర్డ్‌గా రాస్తారు. రివ్యూ రైటింగ్‌కు సంబంధించిన కొన్ని బేసిక్స్ పాటిస్తారు. రివ్యూల వల్ల ఏదైనా ప్రయోజనం ఉంది అనుకుంటే, ఇలాంటివాళ్ళ రివ్యూల వల్ల అంతో ఇంతో ఉంటుంది.
శాడిస్టులు, సినిక్స్ రాసే రివ్యూల వల్ల మాత్రం నష్టమే ఎక్కువ.
శాడిస్టులు, సినిక్స్ రాసే రివ్యూల వల్ల మాత్రం నష్టమే ఎక్కువ.
కొంచెం బాగా ఆడే అవకాశం ఉన్న చిన్న సినిమాలను, మిడ్-రేంజ్ బడ్జెట్ సినిమాలను ఇలాంటి శాడిస్టులు రాసే రివ్యూలు నిజంగానే కిల్ చేస్తాయి.
కాని, "యానిమల్" లాంటి సినిమాల ప్రభంజనాన్ని ఏ నెగెటివ్ రివ్యూలు అసలు టచ్ చేయలేవు.
కట్ చేస్తే -
మొన్న "యానిమల్" సినిమాపైన బాలీవుడ్‌లో చాలా మంది సోకాల్డ్ పాపులర్ రివ్యూయర్స్ రాసిన రివ్యూలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు నిజంగా దారుణం.
అవన్నీ ఒక సినిమా పైన రివ్యూల్లా లేవు. దర్శకుడు సందీప్ వంగా పైన డైరెక్ట్‌గా చేసిన దాడిలా ఉన్నాయి.
అనుపమా చోప్రా, సుచరితా త్యాగి, రాజీవ్ మసంద్, ధ్రువ్ రాథీ... వీళ్లందరికీ "కబీర్ సింగ్" నుంచే సందీప్ వంగా అంటే ఎందుకో నచ్చదు. ఇష్టం లేదు.
ఎందుకింత అయిష్టం? వ్యతిరేకత?
ఎందుకింత అయిష్టం? వ్యతిరేకత?
సందీప్ వంగా, ఆయన సినిమాలూ వాళ్లకు మామూలుగా అలవాటైన బాలీవుడ్ తరహా డైరెక్టర్లూ, సినిమాల్లా ఒక కంఫర్ట్ జోన్‌లో లేకపోవటం మొదటి కారణం.
తెలుగు నుంచి బాలీవుడ్‌కు వచ్చి, సందీప్ వంగా అక్కడ ఇంత దుమ్ము లేపుతుండటం రెండో కారణం. బహుశా ఇదే అసలైన కారణం కావచ్చు.
- మనోహర్ చిమ్మని
తెలుగు నుంచి బాలీవుడ్‌కు వచ్చి, సందీప్ వంగా అక్కడ ఇంత దుమ్ము లేపుతుండటం రెండో కారణం. బహుశా ఇదే అసలైన కారణం కావచ్చు.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani