అక్కడికి ఏటా కనీసం 100,000 మందికి తక్కువకాకుండా వస్తారు.
ఆర్టిస్టులూ టెక్నీషియన్లూ.
వాళ్లల్లో కేవలం 2 శాతం మందికి మాత్రమే ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. మిగిలినవాళ్లంతా కనీసం ఒక సంవత్సరం నుంచి, కొన్ని దశాబ్దాలపాటు నానా కష్టాలు పడి వెనక్కివెళ్ళిపోతారు.
ఇలా వెళ్ళిపోయినవాళ్లంతా అదే హాలీవుడ్‌ను 'Land of Broken Dreams' అని తిట్టుకోవడంలో ఆశ్చర్యంలేదు.
పైనచెప్పిన లెక్కంతా ప్రపంచంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు వర్తిస్తుంది.
మన బాలీవుడ్, టాలీవుడ్‌లు కూడా అందుకు మినహాయింపు కాదు.
సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా అంతే.
ఇకముందు కూడా అంతే.
ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడూ కేవలం 2 శాతం లోపే.
ప్రపంచంలోని ఏ సినీ ఇండస్ట్రీలోనయినా, ఏ పీరియడ్‌లోనయినా కేవలం వేళ్లమీద లెక్కించగలిగిన ఒక డజన్ మంది మాత్రమే లైమ్‌లైట్‌లో-అనే-సక్సెస్‌లో ఉంటారు.
ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ.
మిగిలినవాళ్లంతా ఏదో విధంగా ఫేడ్ అవ్వాల్సిందే.
ఈ వాస్తవాన్ని గ్రహించినవాళ్లు జాగ్రత్తపడతారు. భ్రమలో బతికేవాళ్లు మాత్రం అలాగే సినిమాకష్టాలుపడుతూ కొనసాగుతుంటారు.
కట్ చేస్తే -
అంత నిరాశపడనవసరం లేదు...
సినిమాను ఒక సీరియస్ కెరీర్‌గా, ఒక బిగ్ బిజినెస్‌గా తీసుకున్నవాళ్ళెవ్వరినీ ఫిలిం ఇండస్ట్రీ నిరాశపర్చదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదో విధంగా సినిమా వారికి మంచే చేస్తుంది. డబ్బునిస్తుంది. పేరునిస్తుంది. సెలెబ్రిటీ హోదానిస్తుంది.
సినిమా ప్లాట్‌ఫామ్ అనేది మనం ఇంకెన్నో ఇతర రంగాల్లో ఈజీగా కనెక్ట్ అవడానికి ఉపయోగపడుతుంది.
తిరిగి ఇలాంటి కాంటాక్ట్స్ ద్వారానే కొత్త లీడ్స్, ప్రపోజల్స్, డీల్స్ పూర్తవుతుంటాయి.
సో, సిస్టమ్ ఎప్పుడూ మంచిదే.
కాని, ఆ సిస్టమ్‌ను మనం ఎలా ఉపయోగించుకొంటామన్నదే మన సక్సెస్ ఫెయిల్యూర్స్‌ను డిసైడ్ చేస్తుంది.
2% లో ఉండటం అంత కష్టం కాదు... నిజంగా ఫోకస్ పెడితే.
- మనోహర్ చిమ్మని
2% లో ఉండటం అంత కష్టం కాదు... నిజంగా ఫోకస్ పెడితే.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani