Tuesday, 19 December 2023

సత్యజిత్ రే "పథేర్ పాంచాలి" ఎలా తీశారు?


"సినిమా తీయాలన్న కమిట్‌మెంట్ ఉంటే చాలు. 
డబ్బులు ఎప్పుడూ సమస్య కాదు." 
- సత్యజిత్ రే! 

ఎలా కాదనగలం? 

సత్యజిత్ రే "పథేర్ పాంచాలి" అలాగే తీశాడు. ఉద్యోగం చేస్తూ, జీతం వచ్చినపుడల్లా ఆ డబ్బుతో షూటింగ్ ప్లాన్ చేస్తూ, మరికొంతమంది మిత్రుల ద్వారా కూడా అవసరమయిన డబ్బు ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ, అంచెలంచెలుగా తీశారు. అలాంటి అనుభవంతో చెప్పిన మాట అది. 

సత్యజిత్ రే అలా తీసిన "పథేర్ పాంచాలి" సినిమానే ఆయనకు అంత పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సత్యజిత్ రే ఇంకెన్నో పిక్చర్లు తీశారు. ఆయన అనుకున్న సినిమాలే తీశారు. 

విషయం ఇక్కడ ఆర్ట్ సినిమాలా, కమర్షియల్ సినిమాలా అన్నది కాదు. అనుకున్న సినిమాని ఒక కమిట్‌మెంట్ తో చేయగలగటం. 

అసలు సినిమాలా ఇంకొకటా అన్నది కూడా సమస్య కాదు. చేయాలనుకున్న పని మీద ఒక క్లారిటీ, ఒక కమిట్‌మెంట్ ఉండటం. ఏది ఎలా ఉన్నా, దానిమీదే దృష్టిపెట్టి ఆ పనిని పూర్తి చేసెయ్యటం.

అలాంటి ఫోకస్‌తో కష్టపడ్డ ప్రతి ఒక్కరూ ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించగలిగారు. వాళ్లు అనుకున్నది సాధించగలిగారు. 

- మనోహర్ చిమ్మని    

1 comment:

  1. సత్యజిత్ రే కాలం లో అది వీలయ్యింది కాని ఇప్పుడున్న జమానా లో జీతాల డబ్బులతో సినిమా తీయడమా! డవుటే సుమండోయ్ :).

    కాలు కదపాలంటే కాణీలు రాలలీ కాలంలో! ఎంత కమిట్మెంటూ గట్రా వున్నా కూడా లచ్చిందేవి కరుణించనిదే అవుట్ కం జీరొయే.

    ReplyDelete

Thanks for your time!
- Manohar Chimmani