అంటే రాత్రికి రాత్రే సక్సెస్ సాధించటం అన్న మాట.
ఒక పచ్చి అబద్ధం.
అసలు అలాంటిది లేదు.
ఉండదు.
ఆమధ్య నేను వెళ్లిన ఒక యువ దర్శకుడి ఆఫీస్ లో - పూరి జగన్నాథ్ ఫోటోతో పాటు కొటేషన్ ఒకటి గోడకి అతికించి ఉంది.
“It took 15 years to get overnight success!” అని.
ఇదే కొటేషన్‌ను సుమారు ఓ 20 ఏళ్ళ క్రితం ఓ స్పిరిచువల్ మార్కెటింగ్ గురు Joe Vitale పుస్తకంలో చదివాను.
సినిమా ఇండస్ట్రీలో ఓవర్‌నైట్ సక్సెస్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. కాని, ఆ ఓవర్ నైట్ సక్సెస్‌ల వెనుక ఎన్నో ఏళ్ల కష్టాలు, ఎంతో కృషి ఉంటుంది. అది బయటి వారికి కనిపించదు. ఇన్‌స్టంట్‌గా వారికి కనిపించేది రెండే రెండు విషయాలు.
సక్సెస్, ఫెయిల్యూర్.
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani