అక్కడికి దగ్గర్లో "యూత్ ఐకాన్" బిల్డప్ ఇచ్చుకున్న ఓ మినీ ఎంట్రప్రెన్యూర్‌తో ఒక మీటింగ్ అయింది. స్టోరీలైన్, ప్రాజెక్ట్ డిజైన్, బిజినెస్ స్ట్రాటెజి గట్రా... అన్నీ ఒక 3 గంటలపాటు ఓపెన్‌గా మాట్లాడుకున్నాం.
"మనం కల్సి చేద్దాం" అన్నాడు ఐకాన్.
ఇదంతా ఇప్పుడు నేను చేస్తున్న ఒక సినిమాకి జస్ట్ ఒక 10% ఇన్వెస్ట్‌మెంట్ కోసం!
మీటింగ్‌లో మేం అగ్రీ అయిన దాని ప్రకారం - రెండు రోజుల్లో మన యూత్ ఐకాన్, ఆయన్ని కనెక్ట్ చేసిన నా ఇంకో ప్రియ మిత్రుడు హైద్రాబాద్ వచ్చి అగ్రిమెంట్ చేసుకోవాలి. కాని, ఈ లోగా ఉబ్బు ఆగని మన బిల్డప్ ఐకాన్... ఫిలిం నగర్, క్రిష్ణానగర్, గణపతి కాంప్లెక్స్ గల్లీల్లో తిరిగే ఫస్ట్రేటెడ్ బ్యాచ్‌లను కొందరిని అమాయకంగా కెలికాడు.
ఖతం... యూత్ ఐకాన్ మైండ్ గాన్!
కట్ చేస్తే -
మన యూత్ ఐకాన్‌కు రోజుకు నాలుగు కొత్త డౌట్స్ పుట్టుకొచ్చి, అసలు పని చెట్టెక్కింది.
ఏదో అప్పటికప్పుడు కోటిరూపాయలిచ్చి అగ్రిమెంట్ చేస్తున్నట్టు పెద్ద బిల్డప్‌తో నా పాన్ కార్డు, ఆధార్ కార్డు, నా కంపెనీ లెటర్ హెడ్స్ ఓ పది తీసేసుకుని... ఇక బ్యాంక్ వర్క్ అని, అగ్రిమెంట్ టైపింగ్ అని వెళ్ళారు.
అలా వెళ్ళినవాళ్ళు అటే వెళ్ళారు.
నేను, నా అసిస్టెంట్ హైద్రాబాద్ వచ్చేశాం.
మూడు నెలలు దాటి ఉంటుంది. వాళ్ళు మాత్రం ఇంకా టైపింగ్ వర్క్ నుంచి, బ్యాంక్ నుంచి రాలేదు!
నా లెటర్ హెడ్స్ తిప్పి పంపండి, కొరియర్ చార్జెస్ నేనే ఇస్తా అని కనీసం ఒక పది సార్లు మెసేజెస్ పెట్టాను, కాల్స్ చేశాను. మినిమమ్ రెస్పాన్స్ లేదు, కర్టెసీ లేదు.
ఏ క్రిష్ణానగర్ బ్యాచ్‌కో వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ బైపాస్ అయ్యుంటుంది. అందులో డౌట్ లేదు. అది మనకు అనవసరం కూడా.
థాంక్స్ టు ఆర్జీవీ అండ్ రాజమౌళి... ఇక జన్మలో నేను ఏ విషయాన్ని కూడా సోకాల్డ్ జెన్యూన్‌గా, సోకాల్డ్ రియాలిటీ ఫ్రేమ్‌లో మాట్లాడబోనని, నమ్మబోనని గట్టిగా అనుకున్నాను.
అలా అయితేనే అంతా బాగుంటుంది. అన్ని పనులూ వాటికవే కదుల్తాయి.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani