ఒక సినిమా గురించి, ఆ సినిమా రూపొందించిన డైరెక్టర్ గురించి, అందులో నటించిన యాక్టర్స్ గురించి, పని చేసిన టెక్నీషియన్స్ గురించి, మొత్తంగా ఆ ఫిలిం ప్రాజెక్ట్ గురించి ఆ సమయానికి ఆ వ్యక్తి ఆలోచనలే... రివ్యూ.
ఈ ఆలోచనల్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇండియాలోనైతే కులం, మతం, ప్రాంతం, వర్గం, భావజాలం, అభిమానం, ఎట్సెట్రా.
మనోహర్‌కు బాగా నచ్చిన సినిమా ప్రదీప్‌కు నచ్చకపోవచ్చు. ప్రదీప్ సూపర్ ఉంది అన్న సినిమా మనోహర్‌కు అస్సలు నచ్చకపోవచ్చు.
వ్యక్తిగతంగా మన వ్యూస్ చెప్పడం వేరు.
మన సొంత తరాజులో మనకిష్టమైన బాట్లు వేసి ప్రపంచం కోసం జోకటం వేరు.
కట్ చేస్తే -
ప్రతి శుక్రవారం రిలీజయ్యే ఒక్కో సినిమాకు 101 రివ్యూలు!
1.5 స్టార్స్, 2 స్టార్స్, 3 స్టార్స్, 3.5 స్టార్స్...
అసలీ స్టార్స్ ఇచ్చేవాళ్లకు ఉన్న అర్హతలేంటి?
సోషల్ మీడియాలో ఒక రివ్యూ పోస్టుకు జస్ట్ వంద రూపాయల ఫీజు పెడితే ఎంతమంది రివ్యూలు పెడతారు?
జస్ట్ ఎ డౌట్...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani