ఇప్పటిదాకా "బలగం" ప్రి-రిలీజ్ ఈవెంట్ యూట్యూబ్‌లో చూశాను. మొన్న చూళ్ళేదు.
ఏదో ఇంకో రెండు పక్కా కమర్షియల్ సినిమాలు చేసేసి, నాలుగు డబ్బులు సంపాదించుకొని, ఆ రకంగా కొంచెం ఫ్రీడం తెచ్చుకొని, సినిమాలకు గుడ్‌బై చెప్పి, ఉన్న నాలుగు రోజులు నా ఇష్టమున్నట్టు లైఫ్ ఎంజాయ్ చేద్దాం అని మొన్ననే డిసైడ్ అయినవాన్ని... ఇప్పుడు మనసు మార్చుకున్నాను.
అసలు సిసలు మెయిన్‌స్ట్రీమ్ లోకి ఎంటరవుదామనుకుంటున్నా ఇప్పుడు!
నా ఆలోచనలో ఇలాంటి మార్పు రావడానికి కారణం "బలగం" సినిమా, దిల్ రాజు, దాని దర్శకుడు వేణు & టీమ్, డీజే టిల్లూ ఎట్సెట్రా గెస్టులు మాత్రమే కాదు.
చివరలో మాట్లాడిన సెకండ్ జెనరేషన్ నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డిల్లో హన్షిత మాట్లాడిన రెండు మాటలు నాకు బాగా నచ్చాయి...
ఎంత భారీ దర్శకుడినయినా, ఎంత భారీ హీరోనయినా తెచ్చుకోగల నేపథ్యం ఉన్నా - వాటిని పక్కనబెట్టి, తెలంగాణ ఆత్మను వారి తొలి సినిమాగా అందిస్తున్న ఈ ఇద్దరికీ నా శుభాభినందనలు.
"సెకండ్ జెనరేషన్ ఐకాన్" కేటీఆర్ గారు వాళ్ళిద్దరికీ చెప్పిన రెండు మాటలు ఈ మొత్తం ఈవెంట్‌కే హైలైట్.
కట్ చేస్తే -
"తెలంగాణ సినిమాకు చాలా చెయ్యాల్సి ఉంది, చేస్తాం" అని కేటీఆర్ గారు ఈ వేదిక మీద నుంచి చెప్పటం ఒక గొప్ప ఫినిషింగ్ టచ్.
ఎందుకంటే - సిరిసిల్లలో కేటీఆర్ చెప్పింది చేశారు. చెప్పినదానికంటే వందరెట్లు ఎక్కువ చేశారు.
అదే సిరిసిల్ల నుంచి ఆయనే స్వయంగా చెప్పిన ఈ మాటకు చాలా విలువుందని నాకు తెలుసు. కేటీఆర్ గారి గురించి తెలిసిన అందరికీ బాగా తెలుసు.
ట్విట్టర్‌లో - "ఆస్క్ కేటీఆర్" ద్వారా - నాకిచ్చిన మాటను మర్చిపోకుండా, నన్ను ప్రగతి భవన్ పిలిపించుకొని, నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్"ను ఆవిష్కరించి, నాతో ముచ్చటిస్తూ కేటీఆర్ గారు గడిపిన ఆ విలువైన సమయం నాలో ఇంకా ఫ్రెష్‌గానే ఉంది.
మరోవైపు, ఎన్నో అంశాల్లో హైద్రాబాద్‌ను ఇంటర్నేషనల్ స్థాయి సిటీల్లో ఒకటిగా మనం చూస్తూండగా చేసి చూపించారు కేటీఆర్.
ఈ దిశలో కేటీఆర్ సారథిగా, వారి టీమ్ సాధిస్తున్న విజయాలు నిజంగా ఎపిక్!
వారంలో దాదాపు ప్రతిరోజూ - కనీసం ఒక భారీ ఇన్వెస్ట్‌మెంట్ అయినా తెలంగాణకు తీసుకురాని రోజు లేదు.
ఇన్నిన్ని పనుల్లో నిరంతరం బిజీగా ఉంటూ - ఒక తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమా కోసం - సిరిసిల్లలో కేటీఆర్ గారు రెండు మూడు గంటలు కెటాయించడం అనేది ఆయనకు మాత్రమే సాధ్యమైంది.
That is KTR... The Future Perfect of Telangana.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani