ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ దగ్గర ఎప్పుడూ కనీసం ఒక డజన్ మంది రైటర్స్-డైరెక్టర్స్ క్యూలో ఉంటారు. మన టర్న్ రావడానికి టైమ్ పడుతుంది. రాకపోవచ్చు కూడా.
తాజాగా ఒక హిట్ ఇస్తే పరిస్థితి వేరు అనుకోండి. అది వేరే విషయం.
సో, ఇలాంటి నేపథ్యం ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే కాబట్టి నాలాంటి చాలామందికి ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ తప్పదు.
అంటే కొత్తగా మన ఇన్వెస్టర్స్‌ను మనమే వెతుక్కోవాలి. మన ప్రొడ్యూసర్స్‌ను మనమే కొత్తగా తయారుచేసుకోవాలి.
చిన్నదో పెద్దదో... ఒక సినిమా చేయటం అనేది అంత కష్టం కాదు. పెద్ద పని కాదు.
చిన్నదో పెద్దదో... ఒక సినిమా చేయటం అనేది అంత కష్టం కాదు. పెద్ద పని కాదు.
అయితే - సినిమా కోసం - మన కోర్ టీమ్‌లో - మనతో అసోసియేట్ అయ్యే ముఖ్యమైన ఒకరిద్దరిని ఎన్నుకోడం మాత్రం చాలా కష్టం.
ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేశాం... అన్నీ పర్‌ఫెక్ట్‌గా అనుకున్నాం... "ఇతను నాకు కుడి భుజం", "ఇతను నాకు బ్యాక్ బోన్" గట్రా అని చాలా అనుకుంటాం. అంతా ఓకే, అందరూ ఓకే అనుకుంటాం. కాని, పొరపాటు జరుగుతుంది.
అదంతే.
"క్వయిట్ న్యాచురల్" అనుకొని ముందుకుపోవాల్సిందే.
"క్వయిట్ న్యాచురల్" అనుకొని ముందుకుపోవాల్సిందే.
కట్ చేస్తే -
మొన్న సాయంత్రం మిత్రుడు, డైరెక్టర్ బాబ్జీ మా ఆఫీసుకి వచ్చారు. చాలా సేపు మాట్లాడుకున్నాం.
మా మాటల మధ్య ఆయన అన్న ఒక్క మాటే నాలో ఇంకా లైవ్‌గా ఉంది. నా మైండ్‌లో ఇంకా అదే తిరుగుతోంది.
వ్యక్తిగత కారణాలో, ఇంకే కారణాలో గాని - ఫీల్డులో ఉండాలనుకునేవాళ్ళు ఎవరైనా సరే - గ్యాప్ తీసుకోవద్దు. గ్యాప్ తెచ్చుకోవద్దు.
చిన్నదో పెద్దదో... ఏదో ఒక సినిమా తప్పక చేస్తుండాలి.
బరిలో ఉండాలి.
ఉండి తీరాలి...
ఈ నేపథ్యంలో ఒక రెండు ముఖ్యమైన గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాను. వాటి గురించి ఇంకో పోస్టులో చెప్తాను. ఆసక్తి వున్న లైక్‌మైండెడ్ కనెక్ట్ అవచ్చు.
ఈ నేపథ్యంలో ఒక రెండు ముఖ్యమైన గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాను. వాటి గురించి ఇంకో పోస్టులో చెప్తాను. ఆసక్తి వున్న లైక్‌మైండెడ్ కనెక్ట్ అవచ్చు.
"It’s cool for me because I’m a director, but I’m also a teacher. I’m a lover of cinema, and I love working with people who are hungry and have the energy to really do better work."
~John Singleton
~John Singleton
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani