"Uncertainty is the only certainty in Cinema. In a world of uncertainty everything is possible."
"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు... కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"
ఒకరోజు పొద్దున్నే గురువుగారు దాసరిగారికి కాల్ చేసి అలా అడిగాట్ట ఆయన స్నేహితుడు!
బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట...
ఈ జోక్‌ని స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావుగారు అప్పటి తన బంజారాహిల్స్ ఆఫీసులో నాతో చెప్పారు.
ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని బయటివాళ్ళ అభిప్రాయం. ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం.
"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది. కాని ఇక్కడంతా బీటెక్‌లు, ఎంబిఏలు, పీజీలు, డబుల్ పీజీలు... కామన్.
"అబ్బో సినిమావాళ్లా!" అంటారు కొందరు. మిగిలినవాళ్లంతా ఏదో సొక్కమైనట్టు. వీళ్లేదో చేయరాని పని చేస్తున్నట్టు.
సరే, ఎవరు ఎలా అనుకున్నా ఏం ఫరవాలేదు. "మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్" అనేది కామన్‌సెన్స్.
కట్ చేస్తే -
తాడిచెట్టు కిందకి వెళ్లినప్పుడు అక్కడ తాగాల్సింది కల్లు. పాలు తాగుతానంటే కుదరదు. ప్రిన్సిపుల్స్, పాపడ్స్ అనుకుంటూ కూర్చుంటే ఏం జరగదు. జస్ట్ టైమ్ అలా కరిగిపోతుంటుంది.
అయితే మన ప్యాషన్‌తో, మన సినిమా ప్రొఫెషన్‌తో సంబంధం లేని అవతలి వాళ్లను ఎంత చిన్నస్థాయిలోనయినా సరే ఇబ్బంది పెట్టకూడదు అనేది సినీఫీల్డులో పనిచేసే ఎవరైనా విధిగా గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి రూల్. కానీ, అప్పుడప్పుడూ ఇది మిస్ అవుతుంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో... ఇంకా కొన్ని వ్యక్తిగత ప్రామిస్‌ల విషయంలో.
తప్పు ఎప్పుడూ ఫీల్డుది కాదు.
మన కామన్ సెన్స్, మన నిర్ణయాల తప్పే ఎక్కువగా ఉంటుంది.
ఫీల్డులో మనం కలిసి ప్రయాణం చేయాల్సిన వ్యక్తుల ఎన్నిక విషయంలో కూడా సరిదిద్దుకోలేని తప్పులు జరుగుతాయి. వీటిని రియలైజ్ అయిన మరుక్షణమే ఏదో ఒకటి చెయ్యాల్సి ఉంటుంది. ఆలస్యం చేశామా... ఊహించలేనంత నష్టపోతాం.
బయటికి క్రియేటివిటీ అని, తపస్సు అనీ, ప్యాషన్ అనీ ఎందరో ఎన్నో మాస్కులు వేసుకోవచ్చు. ఇంకెన్నో చెప్తుండవచ్చు. అయితే... పూర్తి మెటీరియలిస్టిక్‌గా... ఒక జాబ్‌లా, ఒక కెరీర్‌లా, ఒక మంచి ఆదాయమార్గంగా, ఒక బిజినెస్‌లా ఆలోచించగలిగినప్పుడు మాత్రమే అన్నీ బావుంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. ఏ గొడవా ఉండదు.
బై డిఫాల్ట్... ఫీల్డుకున్న గ్లామర్, సెలెబ్ స్టేటస్ ఎలాగూ ఒక డ్రైవ్‌లా ఎప్పుడూ పనిచేస్తాయి.
అది తిరుగులేని బోనస్.
కట్ చేస్తే -
సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్.
స్పెషల్ అప్పియరెన్స్‌లాగా ఎప్పుడో పుష్కరానికి ఒక సినిమా చేయడం కాదు. చిన్నదో, పెద్దదో... ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూ ట్రాక్‌లో ఉండటం చాలా ముఖ్యం.
మిగిలినవన్నీ అవే ఫాలో అవుతాయి... డబ్బూ దస్కం, పేరూ గీరూ, ఇంకా ఎన్నో.
ఎన్నాళ్లని ఒక చెస్ పీస్‌లా ఉంటావ్... ఒక్క సారి చెస్ ప్లేయర్ అయ్యి చూడు... తెలుస్తుంది మజా!
And don't forget...
Cinema can fill in the
empty spaces of your life
and your loneliness!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani