మన దేశంలోని సినిమా ప్రియులు, మన ఎన్నారై సినిమా ప్రియులు కూడా... కోట్ల సంఖ్యలో... రేపుదయం లైవ్ చూడబోతున్నారు.
కట్ చేస్తే -
దీనికి సంబంధించి ఒక సీనియర్ నిర్మాత-దర్శకుడు ఒక కామెంట్ చేశారు. వారు మాట్లాడుతున్న వేదిక మీద నుంచి ఒక ఉదాహరణ ఇస్తున్న సమయంలో బహుశా ఇది స్ట్రయిక్ అయ్యి అలా అని ఉండవచ్చు. ఆ కాంటెక్స్‌ట్ పరంగా వారి దృష్టిలో అది కరెక్టే కావచ్చు.
కాని - కాంటెక్స్‌ట్ ఏదైనా - ఏ రకంగా చూసినా - ఈ సమయంలో అదొక వివాదాస్పదమైన కామెంట్ అని నా హంబుల్ ఒపీనియన్.
ఫిలిం ఇండస్ట్రీ ఒక బిగ్ బిజినెస్.
వివిధ దశల్లో ప్రమోషన్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడం సహజం. అది ఆ నిర్మాత, ఆ ప్రొడక్షన్ కంపెనీ, ఆ దర్శకుడు, ఆ టీమ్ ఇష్టం.
ఎవరి లక్ష్యాలు వారికుంటాయి.
తెలుగు సినిమాను అంతర్జాతీయంగా హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తున్న ఈ సమయంలో - వివిధ హాలీవుడ్ అవార్డులతో పాటు, ఆస్కార్ అవార్డు కూడా మనకు అవసరమైన బజ్ క్రియేట్ చేస్తుంది.
కొత్తగా మన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కు ఎన్నో ఆఫర్స్ వస్తాయి. డీల్స్ సెట్ అవుతాయి. బిజినెస్ విస్తరిస్తుంది.
కొత్తగా మన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కు ఎన్నో ఆఫర్స్ వస్తాయి. డీల్స్ సెట్ అవుతాయి. బిజినెస్ విస్తరిస్తుంది.
హాలీవుడ్ సర్కిల్స్‌లో అలాంటి బజ్ క్రియేట్ చెయ్యటం కోసం ఖర్చుపెట్టక తప్పదు. అదంతా పార్టాఫ్ ది బిజినెస్.
రేపు వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తూ, అంతర్జాతీయంగా పాపులారిటీని ఆశిస్తూ సినిమాలు తీయబోతున్న ఈ సమయంలో - ప్రమోషన్ కోసం కొన్ని కోట్లు ఖర్చుపెట్టడం అనేది నథింగ్.
లంచాలిచ్చో, రికమెండేషన్ చేయించుకొనో తీసుకునేది కాదు... ఆస్కార్ అవార్డు.
అవసరమైన ప్రమోషన్ ద్వారా, ఆయా సర్కిల్స్‌లో బజ్ క్రియేట్ చెయ్యటం ద్వారా మన తెలుగు సినిమా, నామినేట్ అయి వున్న మన "నాటు నాటు" పాట ఆస్కార్ వోటర్స్ దృష్టిలో పడతాయి.
అవసరమైన ప్రమోషన్ ద్వారా, ఆయా సర్కిల్స్‌లో బజ్ క్రియేట్ చెయ్యటం ద్వారా మన తెలుగు సినిమా, నామినేట్ అయి వున్న మన "నాటు నాటు" పాట ఆస్కార్ వోటర్స్ దృష్టిలో పడతాయి.
ఆ ప్రయత్నాల వల్లనే కదా స్పీల్‌బర్గ్ అయినా, కెమెరాన్ అయినా RRR సినిమా చూసిందీ, రాజమౌళితో, టీమ్‌తో మాట్లాడిందీ?
సో, ఈ సందర్భంలో ఆ కామెంట్ చాలా ఇబ్బందికరమైనది. ఒక రకంగా మనల్ని మనమే కించపర్చుకోవడం కూడా.
తర్వాత కొందరు సినీ ప్రముఖులు ఆ మాటను పట్టుకొని నానా మాటలు అనటం మరింత రచ్చకు దారితీసింది. వీరంతా అలా అనడానికి కారణం కూడా ఆస్కార్ అవార్డు అందుకోబోతున్న తెలుగు సినిమా మీద అభిమానమే తప్ప ఎవరిమీదా వ్యక్తిగత ద్వేషం కాకపోవచ్చు.
దీన్నిక్కడితో వదిలేసి, అందరం రేపటి 95వ ఆస్కార్ అవార్డ్స్ లైవ్ కోసం ఎదురు చూద్దాం.
జస్ట్ కొన్ని గంటలే ఉంది...
By the way, దీని మెద బెట్టింగ్ కూడా మస్త్ నడుస్తోందని విన్నాను!
By the way, దీని మెద బెట్టింగ్ కూడా మస్త్ నడుస్తోందని విన్నాను!
కట్ చేస్తే -
హాలీవుడ్ పరిధిలో ఆల్రెడీ 2 అవార్డులు సాధించిన "నాటు నాటు" పాటకు తప్పక ఆస్కార్ అవార్డు కూడా వస్తుందని నా గట్టి నమ్మకం.
Best wishes to Director S S Rajamouli, Producer D V V Danayya, Junior NTR, Ram Charan, Music Director Keeravani, Lyricist Chandrabose, Singers Rahul Sipliganj, Kalabhairava & Team!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani