భానుమతి, సావిత్రి, విజయనిర్మల, మీరా నాయర్, అపర్ణా సేన్, దీపా మెహతా, సుచిత్ర చంద్రబోస్, శ్రీప్రియ, నందితా దాస్, ఫర్హా ఖాన్, మేఘనా గుల్జార్, కంగనా రనౌత్, జోయా అఖ్తర్, గురిందర్ చద్దా, బి జయ, సుధా కొంగర, నందిని రెడ్డి, లక్ష్మీ సౌజన్య, గౌరి రోణంకి, కార్తీకి గాన్‌సాల్‌వ్స్...
వీళ్ళల్లో 70 శాతం మంది సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన వుమెన్ ఫిలిం డైరెక్టర్సే.
మొన్న ఆస్కార్ సాధించిన "ది ఎలిఫెంట్ విష్పరర్స్" డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ & ప్రొడ్యూసర్ కార్తీకి గాన్‌సాల్‌వ్స్, గునీత్ మోంగా కూడా మహిళలే!
మొన్న ఆస్కార్ సాధించిన "ది ఎలిఫెంట్ విష్పరర్స్" డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ & ప్రొడ్యూసర్ కార్తీకి గాన్‌సాల్‌వ్స్, గునీత్ మోంగా కూడా మహిళలే!
ఇదొక చిన్న లిస్ట్.
కొంచెం టైం తీసుకొని అధ్యయనం చేస్తే కనీసం ఇంకో వంద మంది వుమెన్ ఫిలిం డైరెక్టర్స్ లిస్ట్ తయారవుతుంది.
ఎప్పుడో 60-70 ఏళ్ళ క్రితమే భానుమతి లాంటివాళ్లు ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా భారీ విజయాలు సాధించారు.
అలాంటిది... ఒక అమ్మాయి డైరెక్టర్ కావాలని ప్యాషన్‌తో ముందుకొచ్చినప్పుడు, ప్రోత్సహించాల్సింది పోయి, ఇప్పుడు 2023 లో కూడా "అందరు ఏమనుకుంటారో" అని భయపడటం నిజంగా విచారకరం.
ఇప్పుడు ఏ కారణాలనైతే చూపిస్తూ భయపడుతున్నారో, ఆ కారణాలు, ఆ పరిస్థితులు అప్పుడు కూడా తప్పకుండా ఉండే ఉంటాయి. అయినా - వాటన్నిటినీ ఫేస్ చేస్తూ అద్భుత విజయాలను సాధించిన, సాధిస్తున్న నారీమణుల లిస్టు పైనే ఉంది.
కట్ చేస్తే -
అరుదుగా ఎవరో ఒకరిద్దరు చేసే నాన్సెన్స్‌ను కామన్ చేయడం అనేది కరెక్టు కాదు. ప్రతి ఫీల్డులోను అలాంటి కొన్ని పరిస్థితులుంటాయి. అలాంటి ఎవరో కొందరుంటారు.
చట్టం అంటూ ఒకటుంటుంది. లా ఆఫ్ ద లాండ్‌కు ఎవరూ అతీతులు కారు.

నిజానికి వేరే ఏ ఫీల్డులో లేనంత ఇబ్బందికరమైన పరిస్థితులు సినీఫీల్డులో ఉండవు.
ఇది గ్లామర్ ఫీల్డు కాబట్టి బయట కథలు కథలుగా చెప్పుకుంటారు. సినిమా వార్తల మీదే బ్రతికే అనేకమంది క్రియేట్ చేసే చెత్త గాసిప్స్, మరింత చెత్తరకం థంబ్‌నెయిల్స్ అసలు నిజాలు కావు.
సినీ ఫీల్డు ఇప్పుడు క్రమంగా ఒక కార్పొరేట్ శైలిలోకి రూపాంతరం చెందుతోంది. అమ్మాయిలే నిర్మాతలుగా భారీ బడ్జెట్ సినిమాల్ని నిర్మించి అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో - ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో - ఏవేవో భయాలు పెట్టుకొని ప్యాషన్‌ను చంపుకోవడం అనేది సరైన నిర్ణయం కాదు. కాబోదు.
యాక్టర్స్, డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్ కావాలన్న ప్యాషన్‌తో సినీఫీల్డులోకి వెళ్ళాలనుకొనే అమ్మాయిలను, మహిళలను ఎవరైనా భేషుగ్గా... భయం లేకుండా ప్రోత్సహించవచ్చు.
"మా అమ్మాయి సినీ ఫీల్డులో పనిచేస్తోంది", "మా అమ్మాయి యాక్టర్", "మా అమ్మాయి ఫిలిం డైరెక్టర్ కాబోతోంది"... అని కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకొనే స్థాయికి, సోషల్ స్టేటస్‌కు ఎప్పుడో ఎదిగింది సినీ ఫీల్డు.

సాఫ్ట్‌వేర్, రియల్ ఎస్టేట్, పాలిటిక్స్, ఎడ్యుకేషన్... వంటి ఇతర ఎన్నో రంగాలను ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేనొక విషయం గట్టిగా చెప్పగలను...
సినీఫీల్డులోనే అమ్మాయిలకు, మహిళలకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. వారి భద్రత గురించి పట్టించుకొంటారు.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani