మన ప్రమేయం లేకుండానే కొన్ని కొన్నిసార్లు ఒకరోజు చాలా చెత్తగా గడిచిపోతుంది. నెగెటివిటీ మనచుట్టూ కమ్ముకుంటుంది. పెయిన్ ఉంటుంది. మానసికంగా గాయపడతాం.
ఇవన్నీ అసలు మన ప్రమేయం లేకుండానే, మన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే జరుగుతాయ్ ఒక్కోసారి, ఒక్కోరోజు.
నిన్నంతా నాకు అలాగే గడిచింది.
అయితే - ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా రియాక్ట్ అయ్యాం, ఎంత పాజిటివ్‌గా ఉన్నాం అన్నదానిమీదే మన తర్వాతిరోజు ఆధారపడి ఉంటుంది.
కట్ చేస్తే -
సమయం వృధా అయిపోతుంది అని బాధపడటం కంటే బాధాకరమైన విషయం ఇంకోటి లేదు.
సమయం ఎప్పుడూ వృధా కాదు. అసాధ్యం. దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక మనమే వృధా అవుతాం.
జీవితంలో ప్రతి ఒక్కరోజు విలువైందే. అది తిరిగిరాదు. ఈ నిజాన్ని అర్థం చేసుకొని, సమయానికి విలువ ఇచ్చినప్పుడు జీవితంలోని ప్రతి పార్శ్వం అద్భుతంగా ఉంటుంది.
దురదృష్టవశాత్తు ఈ జ్ఞానోదయం చాలామందికి చాలా ఆలస్యంగా అవుతుంది.
“Always remember, your focus determines your reality.”
— George Lucas
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani