బింబిసార, సీతారామం... నిన్న రిలీజైన ఈ రెండు సినిమాలూ మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. థియేటర్లలో వసూళ్ళు కూడా బాగున్నాయి.
ఈమధ్య రిలీజై-అట్టర్ ఫ్లాపైన కొన్ని సినిమాలతో పోలిస్తే వీటి వసూళ్ళు సూపర్ డూపర్‌గా ఉన్నాయి. చెప్పాలంటే - పిచ్చి కలెక్షన్స్ అన్నమాట!
ఇంక - రివ్యూల విషయానికొస్తే - షరా మామూలే...
ఫస్టాఫ్ ఓకే, సెకండాఫ్ సాగింది. ..సెకండాఫ్ అద్భుతంగా ఉంది, ఫస్టాఫే సాగింది... ఇలా ఎవరికి తోచింది వాళ్ళు, వాళ్ళ వాళ్ళ టేస్టులనుబట్టి, వాళ్ళ వాళ్ళ 'బ్రాండ్ ఇమేజ్'ను బట్టి, రివ్యూయర్స్ ఏదో ఒకటి రాసేసి వాళ్ళ తిప్పలేదో వాళ్ళుపడ్డారు.
నేనింకా బింబిసార చూళ్ళేదు కాని, నేను నమ్మే కొందరు రెగ్యులర్ సినీగోయర్స్ ద్వారా తెలుసుకున్నదేంటంటే -
టైం ట్రావెల్ కథ బింబిసారలో కళ్యాణ్‌రాం బాగాచేశాడు. అసలీ సినిమా కథ ఒప్పుకొని భారీ రిస్క్ చేసిన కళ్యాణ్‌రాం నమ్మకం నిజమైంది. హిట్ కొట్టాడు. ఆ సినిమా ప్రిరిలీజ్ పంక్షన్లో అనుకుంటాను... జూనియర్ ఎన్‌టీఆర్ చెప్పింది అక్షరాలా నిజమైంది.
Congrats to the Team of Bimbisaara...
Congrats to the Team of Bimbisaara...
ఇక సీతా రామం...
Hearty Congrats to Hanu Raghavapoodi, Swapna Cinema & Vaijayanthi Movies!
Hearty Congrats to Hanu Raghavapoodi, Swapna Cinema & Vaijayanthi Movies!
రాత్రే చూశాను.
విజువల్ ట్రీట్. క్లాసిక్ ప్రేమ కథ.
సెన్సిబుల్ లవ్ స్టోరీలను ఇష్టపడేవారికి ఇది బాగా నచ్చుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు రెండోసారి, మూడోసారి చూడ్డానికి కూడా థి-యే-ట-ర్ల కే వెళ్ళొచ్చు!
సెన్సిబుల్ లవ్ స్టోరీలను ఇష్టపడేవారికి ఇది బాగా నచ్చుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు రెండోసారి, మూడోసారి చూడ్డానికి కూడా థి-యే-ట-ర్ల కే వెళ్ళొచ్చు!
దుల్కర్ అండ్ మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ బాగుంది. అసలీ రామం పాత్రకు తెలుగులో ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది చాలాసార్లు. వేరే ఇంకెవరైనా "డీక్యూ"లా ఆహా అనిపించడం కష్టం.
ఇంక మృణాల్ ఠాకూర్... చెప్పేదేముంది... She's so lovely!
ఆమె మెథడ్ యాక్టింగ్, లుక్స్, స్మైల్, స్లిమ్ ఫిగర్, రొమాన్సింగ్... Simply fascinating...
ఆమె మెథడ్ యాక్టింగ్, లుక్స్, స్మైల్, స్లిమ్ ఫిగర్, రొమాన్సింగ్... Simply fascinating...
కట్ చేస్తే -
జనాలు థియేటర్లకు రావట్లేదని ...మన ఇండస్ట్రీవాళ్ళు సినిమా షూటింగ్స్ అపేశారు. ఏం చెయ్యాలా అని నానా రకాల బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నారు.
అయితే, జస్ట్ 2 నెలల కిందనే - విక్రమ్, మేజర్ సినిమాలు కూడా ఇలాగే హిట్టయ్యాయి.
సేమ్ టు సేమ్... నిన్న కూడా... ఒకేరోజు రిలీజ్ అయిన రెండు సినిమాలూ హిట్ అయ్యాయి. కలెక్షన్స్ సూపర్ గా ఉన్నాయి.
ఇవాళ రేపు... వీకెండ్ కలెక్షన్ ఇంకా పెరుగుతుంది.
మరి... థియేటర్లు అవే, రేట్లూ అవే. ప్రేక్షకులు కూడా అదే ప్రేక్షకులు.
జస్ట్... సినిమాలే మారాయి.
సో... వాట్ నెక్స్‌ట్? ఇప్పుడు మేధోమథనం ఏ విషయంలో జరగాలి?
ఎవరు మారాలి? ఏవి మారాలి? ఎలా మారాలి? ఎందుకు మారాలి?
ఇప్పుడదే మనవాళ్ల ముందున్న మిలియన్ డాలర్ కొశ్చన్!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani