నాకిష్టమైన అమెరికన్ సీరియల్ ఎంట్రప్రెన్యూర్, హెడ్జ్ ఫండ్ మేనేజర్, రచయిత, బ్లాగర్... జేమ్స్ ఆల్టుచర్ కొన్ని నిజాల్ని చాలా అద్భుతంగా చెప్తుంటాడు.
"ఇది పోస్ట్ చేస్తే ఎవరేమనుకుంటారో నాగురించి అన్న ఫీలింగ్ లేకుండా నువ్వు ఏదన్నా పోస్ట్ చేస్తున్నావంటే, నువ్వు రాసినదానికి అర్థం లేనట్టే. ఇదే సూత్రం నువ్వు రాసే పుస్తకాలకు కూడా వర్తిస్తుంది, నీ మొత్తం క్రియేటివ్ యాక్టివిటీకి వర్తిస్తుంది."
కట్ చేస్తే -
నేను రాసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం ప్రచురిస్తున్నప్పుడు నేనూ ఇలాగే ఫీలయ్యాను. కాని, నా మనసు చెప్పినట్టు ముందుకే వెళ్ళాను.
నేను ఊహించినట్టుగానే కేసీఆర్ గారి మీద నా పుస్తకం ఒక "బెస్ట్ సెల్లర్ బుక్" అయ్యింది. నా తోటి కేసీఆర్, తెలంగాణ అభిమానులందరినుంచి ఆశీస్సులు, అభినందనల వెల్లువను మోసుకొచ్చింది.
మరోవైపు, నిన్నటి పోస్టులో నేను రాసినట్టు కొందరు మానసిక వ్యాధిగ్రస్తులు ఊరికే బట్టలు చింపుకొని బాధపడేట్టుచేసింది.
అయితే - ఈ రెంటిలో దేన్ని పట్టించుకోవాలన్నది మన ఇష్టం.
ఏది ఎలా వున్నా... కేసీఆర్ పట్ల, వారి దార్శనికత పట్ల, తెలంగాణ పట్ల నాకున్న అభిమానాన్ని ఇలాంటి ఏ నెగెటివిటీ మార్చలేదు. ఒక బాధ్యతగా నేను చేయబోతున్న ఇలాంటి మరో గొప్ప ప్రయత్నం నుంచి నా దృష్టిని ఏమాత్రం మరల్చలేవు.
Creativity takes courage!
Creativity takes courage!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani