ఎర్రగడ్డ డీటీడీసీ నుంచి రోడ్లూ హైవేలూ, నదులు, పర్వతాలు, ఎవరెస్టులు, సముద్రాలు, మహాసముద్రాలు దాటేసుకొని... సుమారు 7700 కిలోమీటర్లు అకాశమార్గంలో ప్రయాణం చేసి, కొంచెం ఆలస్యంగానైనా, సరిగ్గా ఫ్రెండ్‌షిప్ డే రోజు నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" లండన్ చేరుకుంది.
లండన్ బ్రిడ్జ్ దగ్గర నేను రాసిన కేసీఆర్ పుస్తకం చేత్తో పట్టుకొని నా మిత్రుడు తీసుకొన్న ఫోటోలు చూస్తే ఒక్కసారిగా గూస్‌బంప్స్ రావా?
లండన్‌లోని అత్యంత ఎత్తైన రూఫ్ గార్డెన్ (టాలెస్ట్ బిల్డింగ్) మీదకెక్కితే అక్కడనుంచి వెనకెక్కడో చిన్నగా కనిపిస్తుంటాయి లండన్ బ్రిడ్జ్, దాని కింద థేమ్స్ నది. అంత ఎత్తుకెక్కి... నిల్చుని కాసేపు, ఆరామ్‌గా కూర్చొని కాసేపు, చేతిలో కేసీఆర్ పుస్తకాన్ని తిరగేస్తుంటే ఎలా ఉంటుంది ఆ అనుభూతి? అలాంటి అనుభూతినే గుండెలనిండా నింపుకొని, అంత ఎత్తుకెక్కి నా మిత్రుడు తీసుకొన్న ఫోటోలు చూసిన మొట్టమొదటివాణ్ణి నేనైనప్పుడు ఇంకెలా ఉంటుంది నాకు?
కళ్ళు చెమర్చవా?
ఆ అభిమానం ఎంత అంటే... అక్కడ లండన్ నుంచే ఆర్డర్ పెట్టి, ఇక్కడున్న ఎందరో తనతోటి కేసీఆర్ అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నేను రాసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకాన్ని ఒక గిఫ్ట్‌గా పంపించేంత!
ఎంత దూరం వెళ్ళినా, ఎంత ఎత్తుకెదిగినా మన మూలాలు మర్చిపోకూడదనుకొనేవాడు... అలా ఉన్నప్పుడే సాటిమనిషిపట్ల ప్రేమ, మానవత్వం అనేవి అతి సహజంగా మనలో ఎప్పుడూ బ్రతికే ఉంటాయి అన్నది మనసా-వాచా-కర్మేణా నమ్మి ఆచరిస్తున్నవాడు... నేలమీదుండే మనిషి, నిగర్వి... నవీన్ కుమార్ భువనగిరి నా మిత్రుడు అని చెప్పుకోవడం నాకు మాత్రం గర్వంగానే ఉంటుంది.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani