మన చదువులు మన వివేచనా శక్తికి కొలమానాలు కావు అని చెప్పడానికి ఈ మధ్య చాలా ఎక్కువ ఉదాహరణలు చూస్తున్నాను.
మనకు గుడ్డిగా ఒక హీరో మీదనో, ఒక హీరోయిన్ మీదనో ఇష్టం ఉండొచ్చు. దానివల్ల నష్టం లేదు. అది సినిమాలవరకే పరిమితం.
కాని, రాజకీయాల్లో అలా కాదు.
అంత గుడ్డిగా ఎవరినీ ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫాలో అయితే, కనీసం ఒక కనీస స్థాయి లాజిక్‌కు మన వాదన, మన ఫాలోయింగ్ నిలబడగలగాలి.
కట్ చేస్తే -
రాజకీయాల్ని నేను పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. కాని, మన జీవితంలోని దాదాపు ప్రతి అంశాన్ని రాజకీయాలు ప్రభావితం చేస్తున్నప్పుడు కూడా రాజకీయాల్ని పట్టించుకోకుండా ఉండటం మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి ఫూలిష్ బాక్స్‌లో నేనుండలేను. నాకు ఊపిరాడదు.
ఈ నేపథ్యంలోనే నేను రాసి, ప్రచురించిన పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్".
సరిగ్గా నెల క్రితం, జులై 5 వ తేదీనాడు, ట్విట్టర్‌లో నాకు మాట ఇచ్చినట్టుగానే - ప్రగతిభవన్‌లో నా పుస్తకాన్ని లాంచ్ చేశారు... మన డైనమిక్ మంత్రి, టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
గత ఎనిమిదేళ్ళలో ఒక కొత్త రాష్ట్రంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నేతృత్వంలో వచ్చిన భారీ మార్పులు, తెచ్చిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చూపిస్తున్న అద్భుత ఫలితాలు, పార్టీలతో ప్రమేయం లేకుండా వీటన్నింటిని శ్లాఘిస్తున్న ప్రపంచం... ఇవన్నీ కళ్ళముందు కనిపిస్తున్న నిజాలు.
మరోవైపు - వాస్తవాలు, కనీస లాజిక్స్‌తో సంబంధం లేకుండా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజెస్ ఫార్వార్డ్స్‌కే అంకితమైన ఒక సమూహం. ఈ సమూహంలో ఏదో పెద్దగా చదువుకోనివాళ్ళు మాత్రమే ఉన్నారనుకోడానికి వీళ్లేదని నా వ్యక్తిగత అనుభవంలో ఈ మధ్య బాగా తెలుస్తోంది.
డిగ్రీలు, పీజీలు చదివి, మంచి మంచి ఉద్యోగాల్లో-వ్యాపారాల్లో ఉన్నవారు కూడా వీరిలో కోకొల్లలుగా ఉండటం పెద్ద విషాదం.
రాజకీయాలంటే దోపిడీ, దుర్మార్గం కాదు.
దార్శనికత.
అది మా కేసీఆర్‌లో పుష్కలంగా ఉంది...
డిగ్రీలు, పీజీలు చదివి, మంచి మంచి ఉద్యోగాల్లో-వ్యాపారాల్లో ఉన్నవారు కూడా వీరిలో కోకొల్లలుగా ఉండటం పెద్ద విషాదం.
థాంక్స్ టు కేసీఆర్... పైన నేను పెట్టిన ఫోటో క్రిస్టల్ క్లియర్‌గా తెలంగాణలో ఈ ఎనిమిదేళ్ళలో జరిగిన అభివృద్ధిని గురించి నాలుగు ముక్కల్లో చెప్తోంది.
ఇదే ఎనిమిదేళ్ళలో - జాతీయస్థాయిలో గాని, తత్ పార్టీ పాలిస్తున్న ఇతర రాష్ట్రాల్లో గాని, ఇంకే రాష్ట్రంలో గాని... ఈ స్థాయిలో, ఈ నాలుగు కోణాల్లో జరిగిందా?
ఒకవేళ జరిగింది అంటే ఉదాహరణలివ్వండి. మీరు సాధించినవి కాలర్ ఎగరేసి ఇలా చెప్పుకోండి. అందరూ తప్పక మెచ్చుకుంటారు.
వీటిని పక్కనపెట్టి... వాడు ఈ బట్టలేసుకోవద్దు, వీడు ఇది తినొద్దు, ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తాం, గార్భా డాన్సుకు కూడా పన్ను వేస్తాం, ఈడీల్ని పంపుతాం, అరెస్టులు చేస్తాం... అసలేందివన్నీ?
ఇంకెన్నాళ్ళు ఇలాంటి డైరెక్ట్‌గా సమాధానం చెప్పలేని, డైరెక్ట్‌గా మొహం చూపలేని ఈ వాట్సాప్ కథలు?
75 సంవత్సరాల వజ్రోత్సవ వేళ... కనీసం ఇకనుంచయినా దేశం కోసం ఆలోచించండి... ప్రజల కోసం అలోచించండి.
రాజకీయాలంటే దోపిడీ, దుర్మార్గం కాదు.
దార్శనికత.
అది మా కేసీఆర్‌లో పుష్కలంగా ఉంది...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani