Friday, 17 April 2026

ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటి చాలు


మనకు చాలా విషయాల్లో లెక్కలేనంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. కాని, మన చేతుల్లో లేని కొన్ని విషయాలు షాకిస్తుంటాయి. అలాంటి ఒక పెద్ద షాక్ మొన్నీమధ్య నేను ఎదుర్కొన్నాను. 

టు బి ఫ్రాంక్, ఈరోజుల్లో మానసిక వత్తిడికి లోను కాకుండా వుండటం అంటే అంత ఈజీ కాదు. పెద్ద ఛాలెంజ్. 

డైవర్షన్‌కు సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తుంది. కాని, మన విలువైన సమయాన్ని నష్టపోడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. 

బైదివే, ఈ గ్యాప్‌లోనే కొంచెం బాగా ఆలోచించే సమయం దొరికింది. 

ఒక్కొక్క కమిట్మెంటు, ఒక్కో బాధ్యత త్వరగా పూర్తిచేసుకొనే ప్లాన్ చేసుకుంటున్నాను. ప్లాన్-ఏ-బి-సి-డి...ఎఫ్ కూడా.    

ఇంట్లోనూ నా బుక్ షెల్ఫుల్లోనూ ఉన్న అవసరం లేని క్లట్టరూ, ఇంకా... పనికిరాని ప్రతి చెత్తా ఒక్కొక్కటిగా తీసేస్తున్నాను. 

కట్ చేస్తే -

సోషల్ మీడియా కూడా అంతే. వాడేదో ఫ్రీగా ఇస్తున్నా, మనకున్న విలువైన సమయాన్ని ఎలా వృధా చేసుకుంటాం?

ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్... ఈ మూడిటికి బదులు, ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌నే ఇప్పుడు వాడుతున్నాను. అదొక్కటి చాలు. 

నా బ్లాగ్ పోస్టులన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. 

నెమ్మదిగా ఈ ఇన్‌స్టాగ్రామ్, నా బ్లాగ్ కూడా బోర్ కొట్టే రోజు వస్తుంది. అప్పుడు ఇవి కూడా నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవక తప్పదు.   

When you remove the unnecessary, life doesn’t become empty—it becomes meaningful, focused, and deeply alive. 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani