కొంతమంది ఉద్యోగం ఉంటే చాలు, ప్రాణంతో ఉన్నట్టుగా ఫీలవుతారు. కొంతమంది అది ఎంత మంచి ఉద్యోగమైనా సరే, ఎప్పుడెప్పుడు దాన్నుంచి బయటపడదామా అని చూస్తుంటారు.
యువన్ శేఖర్ రెండో రకానికి చెందిన యువకుడు.
టెస్టింగ్ టూల్స్ విభాగంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మంచి జీతం, ఒక రేంజ్ పొజిషన్‌లో ఉన్నప్పుడే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి ఎంట్రప్రెన్యూర్‌గా రంగప్రవేశం చేశాడు శేఖర్.
రియల్ ఎస్టేట్, రొయ్యల చెరువులు, వైన్స్, స్టాక్స్... ఇలా కనిపించిన ప్రతిచోటా ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపార రంగంలో ముందుకురికాడు. కొన్ని కలిసొచ్చాయి, కొన్ని ఎదురు దెబ్బ కొట్టాయి.
అయినా సరే, పెద్దగా భయపడలేదు. షేక్ అవ్వలేదు. ముందుకే నడవాలనుకున్నాడు.
ఇంకేదైనా బిగ్ బిజినెస్‌లో ప్రవేశించాలనుకున్నాడు. భారీ లెవెల్లో డబ్బు రొటేషన్ ఒక్కటే కాదు... వీఐపీలు, సెలెబ్ సర్కిల్స్‌లో కనెక్ట్ కావడం వంటివి సాధ్యమైన ఒకే ఒక్క రంగం సినిమా బిజినెస్ అన్నది గ్రహించాడు. బాగా అధ్యయనం చేశాడు.
బిజినెస్ అంటేనే రిస్క్. కాని, బిజినెస్‌తో పాటు - తన వ్యక్తిత్వానికి, విజన్‌కు బాగా సూటయ్యే ఇంకెన్నో అదనపు అడ్వాంటేజెస్ ఉన్న సినిమా రంగం తనకు బెస్ట్ అనుకున్నాడు.
ఫిక్స్ అయిపోయాడు.
బిజినెస్ అంటేనే రిస్క్. కాని, బిజినెస్‌తో పాటు - తన వ్యక్తిత్వానికి, విజన్‌కు బాగా సూటయ్యే ఇంకెన్నో అదనపు అడ్వాంటేజెస్ ఉన్న సినిమా రంగం తనకు బెస్ట్ అనుకున్నాడు.
ఫిక్స్ అయిపోయాడు.
కట్ చేస్తే -
"యువన్ సూర్య ఫిలిమ్స్" రిజిస్టర్ అయింది. బిజినెస్ బేసిక్స్ అర్థం చేసుకోడం కోసం, ఒక పైలట్ ప్రాజెక్టుగా, అంతా కొత్త ఆర్టిస్టులతో ఒక రోడ్-క్రైమ్-డ్రామా మొదలెట్టాడు. 36 రోజులు ఏకధాటిగా షూటింగ్ చేసి, గుమ్మడికాయ కొట్టాడు.
శరవేగంగా ఇప్పుడు పోస్ట్-ప్రొడక్షన్ జరుపుకొంటున్న ఆ సినిమా... ఎర్ర గులాబి.
ఈ సినిమాకు దర్శకున్ని నేనే... యువర్స్ ట్రూలీ, మనోహర్ చిమ్మని.
నాలాగే, యువన్ శేఖర్ కూడా ఈ రంగాన్ని ఎంచుకోడానికి ఇంకో బలమైన కారణం ఉంది...
భారీగా డబ్బు, ఫేమ్, కాంటాక్ట్స్ మాత్రమే కాదు... మనలాంటి ప్యాషనేట్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇంకో పది మందికి లైఫ్ ఇవ్వడానికి కూడా ఈ సినిమా రంగాన్ని మించిన అద్భుతమైన ప్లాట్‌ఫామ్ ఇంకోటి లేదు.
ఈ శనివారం, 22 వ తేదీ నాడు, ప్రముఖ యువ నిర్మాత చేతులమీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. ఆ వివరాలు కొన్ని గంటల్లో సోషల్ మీడియాలో వస్తాయి.
- మనోహర్ చిమ్మని
పి యస్:
మా ఇద్దరి కోంబోలో రెండో సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani