ఇది నేను చెప్తున్న విషయం కాదు. 1980ల్లోనే దాసరి నారాయణరావు లాంటి డైరెక్టర్స్ ఎందరో చేసి చూపించారు. అప్పుడు ఫిలిం నెగెటివ్ వాడుతున్నరోజుల్లోనే వాళ్ళు అంత వేగంగా పనిచేశారు. ఇప్పుడున్న లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ ఇస్తున్న సౌకర్యాలతో ఇది ఇంకా ఈజీ అవ్వాలి. కాని మనం రోజురోజుకీ దీన్ని ఇంకా కాంప్లెక్స్ చేసుకోవడం ఏదైతే ఉందో... కొంచెం ఆలోచించాల్సిన అంశం.
దీన్నుంచి ఒక్కటే ఒక్క మినహాయింపు... గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉన్న సినిమాలు.
మిగిలినవి ఏ స్థాయి సినిమాలైనా 30 రోజులు పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలు. పూరి జగన్నాధ్, ఆర్జీవీ వంటి డైరెక్టర్స్ కూడా వారి సినిమాల ద్వారా ఇది చాలా సింపుల్‌గా చేసి చూపించారు. దాదాపు ఓ మూడేళ్ళ క్రితం అనుకుంటాను... ఒక రజినీకాంత్ సినిమాను కూడా జస్ట్ 4-5 నెలల్లో పూర్తిచేసి, రిలీజ్ చేశారు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కు పట్టింది కూడా జస్ట్ నెలరోజులే.
కట్ చేస్తే -
ఇది అసాధ్యమైన పని కాదు. దీనికి కావల్సింది మూడే మూడు అంశాలు:
ఒక సరైన ప్లాన్.
పని చెయ్యడానికి ఒక ఫోకస్డ్ టీమ్.
ఈ పని కోసం అవసరమైన ఫండ్స్.
ఈ మూడింట్లో ఏ ఒక్కటిలేకపోయినా కష్టం. ఒక సినిమాను వేగంగా ముందుకుతీసుకెళ్ళలేము. ఇంకో సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టలేము. ఇది ఇంకోరకమైన స్టకప్. ఇలాంటి స్టకప్ వల్ల ముందు పడిన శ్రమంతా వృధా అవుతుంది.
అందుకే అంటారు... "Film is a battleground" అని. ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో సమస్యలు కొత్త యాంగిల్లో దాడి చేస్తూనే ఉంటాయి. మనం అలర్ట్‌గా ఉండాలి, సమస్యలతో యుద్ధం చేస్తూ ముందుకెళ్తూనే ఉండాలి.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani