నా ఇష్టాలూ నా అనందాలూ అన్నీ మర్చిపోయి, అందరు తండ్రుల్లాగే ఇన్నిరోజులూ - నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం చాలా కష్టపడ్డాను.
ఇప్పుడూ మా ఇద్దరబ్బాయిల చదువులు, కెరీర్ బాధ్యత నావైపు నుంచి దాదాపు పూర్తయిపోయింది. సో, ఇకనుంచి నా గురించి నేను పనిచేసుకోవాలనుకున్నాను. నా కోసం నేను బ్రతకాలనుకొని నిర్ణయించుకొన్నాను.
గత కొన్ని నెలలుగా అదే చేస్తున్నాను.
50+ తర్వాత కొత్తగా నాకు తెలీని ఇంకో ఫీల్డులో అ ఆ ల నుంచి ప్రారంభించడం ఇష్టంలేక - నాకు తెలిసినవాటిల్లోనే కొంచెం భారీ ఫీల్డునే మళ్ళీ టచ్ చేశాను...
సినిమాలు.
ఫిలిం డైరెక్షన్.
ఫిలిం డైరెక్షన్.
ఒక యాంగిల్లో ఇది గ్యాంబ్లింగే. కాని, ఇంకో యాంగిల్లో పరోక్షంగా ఎన్నో విషయాల్లో పనికొచ్చే ఒక మంచి క్రియేటివ్ ప్లాట్‌ఫామ్. ఒకప్పుడు నాకు బాగా ఇష్టమైన ప్యాషన్. ఇప్పుడు బాగా ఆదాయం వచ్చే ప్యాషన్. మంచి పేజ్-త్రీ సర్కిల్స్‌లో తిరగే అవకాశం కూడా ఈ ఫీల్డులోనే సాధ్యం.
అందుకే ఈ సంవత్సరం కనీసం ఒక 2 సినిమాలు చేయాలనుకున్నాను. ఒక సినిమా షూటింగ్ ఆల్రెడీ జనవరి 30 నాడే పూర్తిచేశాను. ఇప్పుడు సిచువేషన్ చూస్తోంటే - కనీసం ఇంకో 2 సినిమాలు ఈజీగా చేస్తా అనిపిస్తోంది.
స్ట్రెస్-ఫ్రీగా, కొత్త చిక్కుల్లో ఇరుక్కోకుండా, యాక్టివ్‌గా, ఎనర్జెటిక్‌గా ఉన్నంతవరకు ఎన్ని సినిమాలయినా చెయ్యొచ్చు.
68 దాటిన మణిరత్నం చెయ్యట్లేదా? 70 దాటిన జేమ్స్ కెమెరాన్ చెయ్యట్లేదా? 90 దాటిన క్లింట్ ఈస్ట్‌వుడ్ చెయ్యట్లేదా? వీళ్లందరి ముందు, అయాం జస్ట్ ఎ బచ్చా.
కాని, విషయం అది కాదు.
కట్ చేస్తే -
ఇందాకే చెప్పినట్టు, ఏదో ఒకటో రెండో సినిమాలు చేస్తూ, ఈ ప్రాసెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేద్దామనుకున్నాను మొదట్లో. నా ఫ్యూచర్ కోసం కొంత డబ్బు సంపాదించుకుందామనుకున్నాను. అయితే - ఇది ఇక్కడ రాసినంత సింపుల్ కాదు.
మారిన ఈ డిజిటల్ యుగపు కండిషన్స్‌లో నానా కథలు పడాలి. సోషల్ మీడియాలో మనకంటూ ఒక ఉనికిని, ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం ఎప్పుడూ ఏదో ఒక బజ్ క్రియేట్ చేస్తుండాలి. ఈ బజ్‌లో భాగంగా - అప్పుడప్పుడూ ఇలా బ్లాగులు రాస్తుండాలి. ఫిలిం మేకింగ్ గురించి నాకు తెలిసింది ఏదో ఒకటి రాస్తుండాలి. సినిమా నేపథ్యం ఉన్న అమ్మాయిలు, హీరోయిన్స్, ఇతర ఆర్టిస్టులు-టెక్నీషియన్స్ ఫోటోలు కూడా ఏదో ఒక ఎఫెక్టివ్ క్యాప్షన్‌తో అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తుండాలి.
ఇదంతా చెయ్యడానికి - నాకు అవసరమైన స్టఫ్ ఎప్పటికప్పుడు అందిస్తూ, నా టీమ్ నాకు సహకరిస్తుంటుంది.
నిత్య డౌటర్స్ ఇదంతా నమ్మరు. ఇదంతా వాళ్లకు అనవసరం. వాళ్ళు అనుకున్నదే వేదం. వాళ్ళు అనుకున్నదే నిజం.
"నువ్వెప్పుడూ కొత్త ప్రేమలకోసం చూస్తుంటావు. ఉన్నవాళ్ళను వదిలేసి, వేరే ఇంకెవరి కోసమో వెతుకుతుంటావు. అసలలా ఆ అమ్మాయిల ఫోటోలు ఎందుకుపెట్టాలి? అలా పోస్టు చేయడం వెనుక అసలు నీ ఐడియా ఏంటో నాకు తెలుసు..."
ఇలా, కొందరి నుంచి కామెంట్స్ వస్తుంటాయి.
ఇంక దీనికి నేనేం చెప్పాలి? ఏం చెప్పినా వింటారా?
సో, బెటర్... నో కామెంట్!
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani