"Most of us aren’t the same person every year."
మనతో కలిసి పనిచేసేవాళ్ళ తాజా వర్కింగ్ స్టయిల్ని బట్టే మన ప్లాన్ ఉండాలన్నది నేను నేర్చుకొన్న కొత్త పాఠం.
మనం ఏదో ఉరుకుతామంటే కుదరదు. మన అంచనాలకు అందకుండా - మనల్ని వెనక్కి లాగే ఫాక్టర్స్ చాలా ఉంటాయి.
కట్ చేస్తే -
ఇప్పుడు ఫీల్డులో నిలదొక్కుకున్నవాళ్లలో 99% మంది ఇలాంటివి ఎన్నో తట్టుకున్నవాళ్ళే అన్నది వాస్తవం. వాళ్లకిదే ప్రపంచం కాబట్టి తప్పదు. తట్టుకున్నారు, సాధించారు. కాని, ఈ నేపథ్యంలో వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారో, ఎంత జీవితం కోల్పోయారో ఎవరికి తెలుసు?
అలాంటి "డూ ఇట్ నౌ" మైండ్‌సెట్ టీమ్‌లో ప్రతి ఒక్కళ్ళకీ ఉండాలన్నది నా పాయింట్. కాని, ఉండదు.
మన టీమ్‌లోనివాళ్ళు, బయటివాళ్ళు, మనకు అసలు సంబంధం లేనివాళ్ళు... వీళ్లందరి వ్యక్తిగత ఆలోచనావిధానం, జీవనశైలి మన అంచనాల్ని, మన నిర్ణయాల్నీ శాసిస్తుంటాయి.
మన టీమ్‌లోనివాళ్ళు, బయటివాళ్ళు, మనకు అసలు సంబంధం లేనివాళ్ళు... వీళ్లందరి వ్యక్తిగత ఆలోచనావిధానం, జీవనశైలి మన అంచనాల్ని, మన నిర్ణయాల్నీ శాసిస్తుంటాయి.
పరోక్షంగా వీళ్లందరి నిర్ణయాల మీద మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది!
అంతకంటే దారుణం లేదు. అంత సమయం నేను వృధా చేసుకోలేను.
ఒక అద్భుతమైన ఫీల్డుని చెత్త ఫీల్డు అని బయటివాళ్ళు అనుకునేలా చేసే ఫాక్టర్స్ వేరే ఉంటాయి. ఆ ఫాక్టర్స్ వల్లనే ఎవరైనా బాధపడేదీ, ఎదుటివాళ్లను బాధపెట్టేదీ.
ఈ వాస్తవాన్ని గుర్తించినవాళ్ళే సినిమాను ప్రేమిస్తారు. సినిమాల్లో ఉంటారు.
ఈ వాస్తవాన్ని గుర్తించినవాళ్ళే సినిమాను ప్రేమిస్తారు. సినిమాల్లో ఉంటారు.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani