తమ ఆదాయంలో సుమారు 65% డబ్బు, అంటే మొత్తం ఒక 102 బిలియన్ డాలర్స్‌ను చారిటీ కోసం వెచ్చించిన రతన్ టాటాను కూడా విమర్శించే 'పనికిమాలిన బ్యాచ్' పోస్టులను ఫేస్‌బుక్‌లో చూసి కంపరం పుడుతోంది.
వీళ్ళంతా 'మేధావులు', 'మేధో జర్నలిస్టులు'... అని వీళ్ళకి వీళ్ళే అనుకుంటారు.
వీళ్ళ లెక్క ప్రకారం, రతన్ టాటా లాంటివాళ్ళు బాగా సంపాదించి, ఇలాంటి పనిదొంగలకు అన్నీ పుక్యానికి ఇవ్వాలి. అప్పుడే టాటా కాని, ఇంకో ఇండస్ట్రియలిస్టు గాని మంచోళ్ళయిపోతారు.
కట్ చేస్తే -
కమ్యూనిజం నామరూపాల్లేకుండా పోయి చాలా కాలమైంది.
అదొక ఫెయిల్యూర్ యుటోపియా.
తూర్పు యూరోప్ దేశాలు కమ్యూనిజం నేపథ్యంలో పూర్తిగా కొలాప్స్ అయి, చివరికి కేపిటలిస్టిక్ డెమోక్రసీనే సరైందని తెలుసుకున్నాయి. సోషలిస్టు అగ్రరాజ్యంగా ఒక ఊపు ఊపిన సోవియట్ యూనియన్ కూడా ముక్కలవక తప్పలేదు.
ప్రపంచపటం మీద ఇప్పుడు మిగిలి ఉన్న ఒకే ఒక్క చెప్పుకోదగ్గ అత్యంత శక్తివంతమైన కమ్యూనిస్టు దేశం చైనాలో కూడా ఇప్పుడు దాదాపు 3 వేల కోట్ల యు యస్ డాలర్ల వ్యక్తిగత సంపద ఉన్న జాక్ మా లాంటి బిలియనేర్లు ఎందరో పుట్టుకొస్తున్నారు.
చైనా కాకుండా... క్యూబా, లావోస్, వియత్నాం, ఉత్తర కొరియా తప్ప ప్రపంచపటం మీద కమ్యూనిస్టు పాలన ఆనవాళ్లెక్కడున్నాయి?
ప్రపంచపటం మీద ఇప్పుడు మిగిలి ఉన్న ఒకే ఒక్క చెప్పుకోదగ్గ అత్యంత శక్తివంతమైన కమ్యూనిస్టు దేశం చైనాలో కూడా ఇప్పుడు దాదాపు 3 వేల కోట్ల యు యస్ డాలర్ల వ్యక్తిగత సంపద ఉన్న జాక్ మా లాంటి బిలియనేర్లు ఎందరో పుట్టుకొస్తున్నారు.
చైనా కాకుండా... క్యూబా, లావోస్, వియత్నాం, ఉత్తర కొరియా తప్ప ప్రపంచపటం మీద కమ్యూనిస్టు పాలన ఆనవాళ్లెక్కడున్నాయి?
అవి కూడా క్రమక్రమంగా లిబరలైజ్ కావడం లేదా?
'ఇలా ఉండాలి... అలా ఉండాలి' అని నాలుగు గోడల మధ్య కూర్చొని రాసే రాతలతో ప్రపంచదేశాలు ప్రగతిపథంవైపు వెళ్ళవు.
ప్రఖ్యాత రచయిత్రి ఐన్ రాండ్ కూడా అప్పటి రష్యా నుంచి పారిపోయి అమెరికా వెళ్ళింది. ఇంగ్లిష్ నేర్చుకొంది. హాలీవుడ్‌లో స్క్రీన్ రైటర్‌గా పనిచేసింది. తర్వాతనే ఫౌంటేన్ హెడ్. అట్లాస్ ష్రగ్గ్‌డ్ లాంటి సెన్సేషనల్ నవలలు రాసింది. ఆబ్జెక్టివిజం అనే కొత్త ఫిలాసఫీ సృష్టించింది.
ముందు ఇలాంటి చిన్న చిన్న సాధారణ వాస్తవాలను తెలుసుకోవాలి. అయినాసరే, మేమింతే అనుకుంటే, ముందు మీ కుటుంబంలో ఉన్న నలుగురినైనా మీ బాటలో నడపడానికి ప్రయత్నించండి. రతన్ టాటా లాంటివాళ్ళను విమర్శించగలిగే కనీస హక్కు మీకు అప్పుడొస్తుంది.
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
Ratan Tata is a true legend whose contribution to India's economic growth is immense.
ReplyDeleteCommies are parasites.
They have infested even TISS (Tata institute of social sciences) and injecting students with anti national woke mindset.