కట్ చేస్తే -
ఈ సోకాల్డ్ గ్రేట్ క్రిటిక్స్ రివ్యూల వల్ల ప్రతి శుక్రవారం ఎంతమంది మనోభావాలు దెబ్బ తినటం లేదు?
దాదాపు ప్రతి ఫిలిం ప్రెస్ మీట్లో ఎంతమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మనోభావాలు దెబ్బతినటం లేదు?
అది బాగా లేదు, ఇది బాగా లేదు. ఫస్టాఫ్ ఓకే, సెకండాఫ్ సాగింది. డైరెక్టర్ గ్రిప్పు కోల్పోయాడు. స్క్రిప్టు బాగాలేదు. అసలు ఇంకో పది నిమిషాలు ఎడిట్ చెయ్యొచ్చు. అన్నీ బాగున్నాయి, ఒక్క డైరెక్షనే చెత్తగా ఉంది... ఇలా అబ్బో ఏం రాస్తారో!
జేమ్స్ కామెరన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లకు కూడా స్క్రిప్ట్ రైటింగ్, ఫిలిం మేకింగ్ నేర్పగల నిష్ణాతులు వీళ్ళు!!
జేమ్స్ కామెరన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లకు కూడా స్క్రిప్ట్ రైటింగ్, ఫిలిం మేకింగ్ నేర్పగల నిష్ణాతులు వీళ్ళు!!
ఇన్ని తెలిసిన ఈ గ్రేట్ రివ్యూయర్స్ అందరూ ఒక్క సినిమా ఎందుకని తీసి, సక్సెస్ చేసి చూపించకూడదు? హీరోలు, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్లందరికీ బాగా పరిచయమే కదా? వాళ్ల దృష్టిలో 5/5 పాయింట్స్ వచ్చే కథతో, అదిరిపోయే స్క్రిప్టు రాసుకొని హీరోల డేట్స్ తీసుకోవచ్చుకదా?
సినిమా ఎలా తీయాలో వీళ్ళందరికీ చాలా బాగా తెలుసు కదా? మరింకేం, తీసి... హిట్స్ మీద హిట్స్ కొట్టి కోట్లు సంపాదించొచ్చు కదా?
ఎందుకని ఆ పనిచేయరు?
ఎంతసేపూ వారం వారం రివ్యూల పేరుతో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కష్టానికి పాయింట్స్ వేసి, వారి మనోభావాలు దెబ్బతీయడమేనా పని? అందులో అంత ఆనందం ఏముంటుంది?
సినిమా తీసేవాడు తీస్తుంటాడు. చూసేవాడు చూస్తుంటాడు. బాగుంటే బాగుందంటాడు. బాగా లేకపోతే చెత్త సినిమా అంటాడు. ఆ ఫ్రీడం ప్రేక్షకులకు ఎప్పుడూ ఉంటుంది. కాని మధ్యలో వీళ్ళెవ్వరు?
ఒక వ్యక్తి రాసే రివ్యూ అతని వ్యక్తిగత అభిప్రాయం కాదా? దాన్నే ప్రామాణికంగా చెప్తూ 3/5, 2.5/5, 2/5, 1/5... అని ఆ రేటింగులేంటి అసలు? ఏమన్నా అర్థముందా?
సినిమా తీసేవాడు కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు. సినిమా రిజల్టుని బట్టి కోట్లు సంపాదిస్తున్నాడు, లేదా కోట్లు పోగొట్టుకుంటున్నాడు.
దురదృష్టవశాత్తూ, వీళ్ల రివ్యూల వల్ల కోట్లు పోగొట్టుకున్నవాడి కోట్లలోనే వాడి ప్రమోషన్ బడ్జెట్ కూడా ఉంది. పీఆర్వో బడ్జెట్ కూడా ఉంది. కవర్లు కూడా ఉన్నాయి. వాడి మనోభావాలు ఎంత దెబ్బతినాలి వీళ్ల సోకాల్డ్ రివ్యూలకు?
దురదృష్టవశాత్తూ, వీళ్ల రివ్యూల వల్ల కోట్లు పోగొట్టుకున్నవాడి కోట్లలోనే వాడి ప్రమోషన్ బడ్జెట్ కూడా ఉంది. పీఆర్వో బడ్జెట్ కూడా ఉంది. కవర్లు కూడా ఉన్నాయి. వాడి మనోభావాలు ఎంత దెబ్బతినాలి వీళ్ల సోకాల్డ్ రివ్యూలకు?
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani