జీవితమంతా పిల్లల కోసం కష్టపడటంతోనే సరిపోతుంది...
మన ఇష్టాలు, మన ప్యాషన్స్... ఇంకెన్నో మన ప్యాషనేట్ థింగ్స్, పర్సనల్ ఫేసినేషన్సూ... పిల్లల కోసం అన్నీ అలా వదిలేసుకుంటాం.
చూస్తుండగానే పిల్లలు చాలా పెద్దవాళ్ళయిపోతారు.
కొంచెం ఫ్రీ అయ్యాం కదా, ఇక పిల్లలతో కాస్త ఎక్కువ సమయం గడపొచ్చు అనుకుంటాం.
కట్ చేస్తే -
ఒక టైమ్ వస్తుంది.
ఒక్కొక్కరే... మనం అంత ఈజీగా కలుసుకోలేనంత దూరం ప్రయాణమవుతారు.
సంవత్సరానికో, రెండేళ్ళకో తప్ప ఇంక కలవలేం.
సంవత్సరానికో, రెండేళ్ళకో తప్ప ఇంక కలవలేం.
అది వారి జీవితం. వారి ఇష్టం. వాళ్ళెప్పుడూ సంతోషంగా ఉండాలి.
వారి కోసం నేను చేయగలిగినదాంట్లో కనీసం ఒక పది శాతం కూడా చెయ్యలేకపోయాను. ఆ నేపథ్యం, ఆ కారణాలిప్పుడు అనవసరం. అయినా సరే, ఇంకా తాపత్రయపడుతున్నాను. తండ్రిని కదా...
ఇప్పుడు, ఈ క్షణం కూడా వారి కోసం ఇంకేం చెయ్యగలనా అని ఆలోచిస్తున్నాను.
కట్ చేస్తే -
ఇంకొన్ని గంటల్లో మమ్మల్ని వేరు చేసే ఫ్లయిట్... నాకూ వారికీ మధ్య సుమారు 14,000 కిలోమీటర్ల దూరాన్ని సృష్టించబోతున్న లోహవిహంగం...

సుమారు 30 నెలల క్రితం బెంగుళూరు నుంచి నాకెంతో ప్రియమైన మా చిన్నబాబుని ఫ్లయిట్ ఎక్కిస్తూ ఇలాగే నిశ్శబ్దంగా వర్షించాను.
ఇప్పుడు మా పెద్దబాబు... నా ప్రాణం.
ఇప్పుడు మా పెద్దబాబు... నా ప్రాణం.
ఎంత ప్రేమ వీళ్లంటే నాకు?
అసలెలా ఇంత తేలికగా, ఇంత సులభంగా, ఇంత భావశూన్యంగా వీళ్లని ఇంతింత దూరం పంపించగలుగుతున్నాను?
ఇంత రాక్షసున్ని ఎప్పుడయ్యాన్నేను?
అసలెలా ఇంత తేలికగా, ఇంత సులభంగా, ఇంత భావశూన్యంగా వీళ్లని ఇంతింత దూరం పంపించగలుగుతున్నాను?
ఇంత రాక్షసున్ని ఎప్పుడయ్యాన్నేను?
ఒక్క క్షణం ఆలోచిస్తే, గుండెల్లో ఎక్కడో కలుక్కుమంటోంది. ఈ నొప్పి భరించలేకపోతున్నాను. నా కళ్ళు పదే పదే తడిసిపోతున్నాయి నాకు తెలియకుండానే.
ఈ పరిణామం కోసమే కదా జీవితమంతా నేను కష్టపడింది? నాకిష్టమైనవి ఎన్నో వదిలేసుకుంది? నాకిష్టమైన ఎందరినో దూరం చేసుకుంది?
చివరికి వీళ్ళూ దూరమే కదా అవుతోంది?
ఇంతకుముందు మా తల్లిదండ్రులు కూడా బహుశా ఇంతే కదా? ఇలాంటి అనుభవమే కదా చివరి క్షణం వరకూ మా తల్లిదండ్రులు కూడా అనుభవించింది?
ఇంతకుముందు మా తల్లిదండ్రులు కూడా బహుశా ఇంతే కదా? ఇలాంటి అనుభవమే కదా చివరి క్షణం వరకూ మా తల్లిదండ్రులు కూడా అనుభవించింది?
ఎంత క్రూరమైంది ఈ ప్రకృతి చక్రం?
ఖతమ్.
జీవితం అయిపోయింది.
ఖతమ్.
జీవితం అయిపోయింది.
కట్ చేస్తే -
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్...
ఇప్పుడు ప్రారంభిస్తున్నాను నా జీవితం, కొత్తగా.
ఇప్పుడంతా ఇక నా ఇష్టం.
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
మీ సినిమా పరిభాషలో చెప్పాలంటే ఇది మీ జీవితంలో ఇంటర్వెల్ బ్లాక్ అన్న మాట.
ReplyDeleteVery true andi.
Delete