ఒక అయిడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు.
ఒక్కోసారి, ఒక ఫోన్ కాల్ కూడా అలా జీవితాన్ని మార్చెయ్యవచ్చు.
"బటర్‌ఫ్లై ఎఫెక్ట్"లా... పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా... ఓవర్‌నైట్‌లో నా మీద ఊహించనంత ప్రభావం చూపించగలిగే అలాంటి శక్తి వున్న ఆ ఒకే ఒక్క కాల్ కోసం ఇప్పుడు నేను ఎదురుచూస్తున్నాను.
కట్ చేస్తే -
ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా... అవ్వా బువ్వా రెండూ కావాలంటే కుదరదు.
ఏదైనా ఒక్కటే ఎన్నిక చేసుకోవాలి. దాని మీదే పూర్తి ఫోకస్ పెట్టాలి. ఆ తర్వాత మనం సాకులు వెతుక్కోలేం. మనం చేసినదానికి, వచ్చిన ఫలితానికీ బాధ్యత తీసుకొని తీరాలి.
అలాంటి చాలెంజ్‌కు సిద్ధపడగలిగినవారే ఏదైనా సాధిస్తారు.
ఇప్పుడు నేను అలాంటి ఒక గట్సీ చాలెంజ్‌ను నామీద నేనే విసురుకున్నాను.
ఇప్పుడు నేను అలాంటి ఒక గట్సీ చాలెంజ్‌ను నామీద నేనే విసురుకున్నాను.
సో, ఏ పావులు కదిలించాలో కదిలించు. ఏం చెయ్యాలో చెయ్యి. కాని, ఫోకస్ మాత్రం పూర్తిగా ఏదైనా ఒక్కదానిమీదే పెట్టు.
కాల్ తెప్పించుకుంటావో, కాళ్లే పట్టుకుంటావో నీ ఇష్టం.
ఒక తపస్సులా పనిచెయ్యి.
నువ్వు అనుకున్నది ఏదైనా అతి సులభంగా నువ్వే సాధిస్తావు.
నువ్వు అనుకున్నది ఏదైనా అతి సులభంగా నువ్వే సాధిస్తావు.
Now, go and wait for that one call that will change your life overnight...
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani