ప్రొఫెషనల్‌గా కావచ్చు, పర్సనల్‌గా కావచ్చు... మన జీవితంలోకి వచ్చే చాలామంది యూట్యూబ్ వీడియోలో యాడ్స్ లాంటివాళ్ళు.
ఏం ఆలోచించకుండా అలా "స్కిప్ యాడ్" కొట్టేసెయ్యాలి... కొట్టేస్తాం కూడా.
ప్రతి యాడ్ చూసుకుంటూ కూర్చుంటే మనం చూడాలనుకున్న వీడియో చూడలేం. అప్పటికే మన టైమ్ అయిపోతుంది... అసలు వీడియోకే స్కిప్ కొట్టాల్సి వస్తుంది.
కట్ చేస్తే -
చాలా చాలా అరుదుగా - అనుకోకుండా - మనకు అసలు సంబంధం లేని, మనమెప్పుడూ ఊహించని ఏదో ఒక యాడ్ చూస్తాం. ఆశ్చర్యంగా కనెక్టయిపోతాం. మనకు తెలీకుండానే కంటిన్యూ అయిపోతాం.
అదే మ్యాజిక్.
అలాంటి మ్యాజిక్ క్రియేటివ్ రంగాల్లో ఉన్న ప్రతిమనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. కాని, అప్పుడే మొదలవుతుంది అసలు కథ...
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani