"శివ" ప్రాజెక్టు ఓకే అవ్వడం కోసం ఆర్జీవీ ఎందరినో మేనిప్యులేట్ చేశాట్ట. తనకు అనుకూలంగా రిజల్ట్ రావడం కోసం ఒకరిదగ్గర ఒకలాగా, ఇంకొకరి దగ్గర ఇంకోలాగా మాట్లాడాట్ట. ఈ విషయం తనే స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
ఆమధ్య ఒక కాలేజి ఫంక్షన్లో స్పీచ్ ఇస్తూ, యస్ యస్ రాజమౌళి కూడా దాదాపు ఇలాంటిదే ఒక విషయం చెప్పాడు: "మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎన్నో అబద్ధాలాడాల్సి ఉంటుంది. ఎన్నో మేనిప్యులేషన్స్ చెయ్యాల్సి ఉంటుంది. మీ ప్రొఫెషన్ కోసం అవన్నీ చెయ్యండి. కాని, నీకు నువ్వు అబద్ధాలు చెప్పుకోకు... నిన్ను నువ్వు మభ్యపెట్టుకోకు" అని.
కట్ చేస్తే -
ఇదంతా ఇప్పుడు నేను చేస్తున్న ఒక ఫిలిం ప్రాజెక్టులో జస్ట్ ఒక 10 లేదా 20 పర్‌సెంట్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం!
ఆమధ్య ఒక కాలేజి ఫంక్షన్లో స్పీచ్ ఇస్తూ, యస్ యస్ రాజమౌళి కూడా దాదాపు ఇలాంటిదే ఒక విషయం చెప్పాడు: "మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎన్నో అబద్ధాలాడాల్సి ఉంటుంది. ఎన్నో మేనిప్యులేషన్స్ చెయ్యాల్సి ఉంటుంది. మీ ప్రొఫెషన్ కోసం అవన్నీ చెయ్యండి. కాని, నీకు నువ్వు అబద్ధాలు చెప్పుకోకు... నిన్ను నువ్వు మభ్యపెట్టుకోకు" అని.
కట్ చేస్తే -
ఈమధ్య నేను వైజాగ్ వెళ్ళాను. అక్కడికి దగ్గరలో ఒక యూత్ ఐకాన్ లాంటి ఎంట్రప్రెన్యూర్‌తో ఒక మీటింగ్ అయింది.
స్టోరీలైన్, ప్రాజెక్ట్ సెటప్, డిజైన్, బిజినెస్ స్ట్రాటెజి గట్రా... అన్నీ ఒక 3 గంటలపాటు ఓపెన్‌గా మాట్లాడుకున్నాం.
"మనం కల్సి చేద్దాం" అన్నారాయన.
"మనం కల్సి చేద్దాం" అన్నారాయన.
తర్వాత ఒక రెండు-మూడు రోజుల్లో మన యూత్ ఐకాన్, ఆయన్ని కనెక్ట్ చేసిన నా ఇంకో ప్రియ మిత్రుడు హైద్రాబాద్ వచ్చి అగ్రిమెంట్ చేసుకోవాల్సింది...
ఈ లోగా మన కృష్ణానగర్, గణపతి కాంప్లెక్స్, ఫిలిం నగర్ గల్లీల్లో అవకాశాల కోసం వెతుక్కొంటూ తిరిగే ఫస్ట్రేటెడ్ బ్యాచ్‌లేవో కనెక్ట్ అయి, మనవాడి మైండ్ తినేశాయి.
కట్ చేస్తే -
ఇపుడు మన యూత్ ఐకాన్‌కు రోజుకు నాలుగు కొత్త డౌట్స్ పుట్టుకొస్తున్నాయి కాని, అసలు పని ఇంచ్ కూడా కదల్లేదు!
నేను నోటికొచ్చిన అబద్ధాలాడితే మాత్రం ఎప్పుడో అగ్రిమెంట్ అయిపోయేది. రెండువైపులా కూల్‌గా, హాయిగా ఉండేవాళ్లం.
కాని, పని జరక్కుండా దాదాపు నెల గడిచింది. పని ఇంక అవ్వకపోవచ్చు.
అదంతే.
నాకు తెలుసు.

థాంక్స్ టు ఆర్జీవీ అండ్ రాజమౌళి... ఇక జన్మలో నేను ఏ విషయాన్ని కూడా జెన్యూన్‌గా, రియాలిటీ ఫ్రేమ్‌లో మాట్లాడబోనని గట్టిగా అనుకున్నాను.
ఇప్పుడు అంతా బాగుంటుంది.
అన్ని పనులూ వాటికవే కదుల్తాయి.😊
ఇప్పుడు అంతా బాగుంటుంది.
అన్ని పనులూ వాటికవే కదుల్తాయి.😊
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani