ఆయా విభాగాల్లో తగిన అర్హతలు ఉండి - అవకాశం కోసం ఎదురుచూస్తున్న "న్యూ టాలెంట్" టచ్‌లో ఉండండి. ఇక్కడే వాటికి సంబంధించిన యాడ్స్ దేనికదే ఇస్తుంటాము. వాటిలో చెప్పిన విధంగా అప్లై చేసుకోండి. కాల్స్ చేయవద్దు. మేం ప్రాథమికంగా ఎన్నిక చేసినవారికి మా ఆఫీసు నుంచి కాల్ వస్తుంది. వాళ్ళు మాత్రమే ఆడిషన్/ఇంటర్వ్యూకి రావచ్చు.
కట్ చేస్తే -
మా #ManutimeMovieMission ప్రొడక్షన్ హౌజ్ నుంచి ప్రతిష్టాత్మకంగా మల్టిపుల్ ఫిలిం ప్రాజెక్టులను ఒకేసారి సెప్టెంబర్‌లో ప్రారంభించబోతున్నాము. ఈ నేపథ్యంలో - వివిధ విభాగాల్లో మాకు "కొత్త" ఆర్టిస్టులు-టెక్నీషియన్స్, చీఫ్ టెక్నీషియన్స్ అవసరం చాలా ఉంటుంది.
నా గత చిత్రాల ద్వారా ఇప్పటికే 55+ కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ను పరిచయం చేశాను. వీరిలో హీరోలు, హీరోయిన్స్, విలన్స్, సపోర్టింగ్ ఆర్టిస్టులు, డాన్స్ మాస్టర్స్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎడిటర్స్... ఇలా ఎందరో ఉన్నారు. నిజంగా మీలో టాలెంట్ ఉండి, సినిమాల్లో ఏదైనా సాధించాలన్న తపన, మంచి డిసిప్లిన్, మంచి కమ్యూనికేషన్, చెదరని ఏకాగ్రత ఉన్నట్టయితే మీరూ రేపు నా కొత్త సినిమా ద్వారా ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం కావచ్చు!
ఆల్ ద బెస్ట్!!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani