సుమారు ఏడేళ్ళ క్రితం నా సినిమాలో పనిచేసినప్పుడు జరిగిన ఒక చిన్న అసౌకర్యం గురించి, అప్పుడు నా టీమ్‌లో పనిచేసిన మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒకతను ఇవాళ నాకు ఉన్నట్టుండి ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా గుర్తుచేశాడు!
దేశంలో ఇప్పుడు టాప్ పొజిషన్‌లో ఉన్న డైరెక్టర్స్ అందరూ అంతకు కనీసం వందరెట్ల అసౌకర్యాలు, కష్టాలు అనుభవించి గాని వారు ఇప్పుడున్న ఉన్నత స్థాయికి రాలేదన్నది నా పాయింట్.
కాని, నేనలా చెప్పలేదు అతనికి.
అతను నన్ను హర్ట్ చేసినా, నేనతన్ని ఏదో ఒక మాట అని హర్ట్ చెయ్యలేకపోయాను. నా యాటిట్యూడ్ అది కాదు.
అతనొక మంచి టెక్నీషియన్ కూడా. ఏదైనా ఒక పని నేను అతనికి చెప్తే, మళ్ళీ ఇంక దాని గురించి నేను ఆలోచించే అవసరాన్ని ఇచ్చేవాడు కాదు. అలాంటి వాడు... సడెన్‌గా నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఏ పనిలో ఉన్నాను, ఏదైనా డిస్టర్బ్ అవుతుందా అన్న ఆలోచన లేకుండా... ఠకీమని ఇలాంటి మెసేజెస్ పెట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది.
పైగా ఇప్పుడతను మంచి జాబ్‌లో కూడా ఉన్నాడు. అప్పటికన్నా ఇప్పుడు అతనిలో ఇంకా మెచ్యూరిటీ, బాధ్యత పెరగాలి.

"నువ్వు తీరిక చేసుకొని ఒకసారి నా ఆఫీసుకి రా. మాట్లాడదాం" అని జవాబిచ్చాను.
కట్ చేస్తే -
ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ట్రెండ్ సెట్టర్ సినిమాను అందించిన ఒక దర్శకుడు, ఆయన టీమ్... అతని రెండో సినిమాకో మూడో సినిమాకో పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఒకరోజు లంచ్‌కు డబ్బుల్లేక, బండి మీద రేగ్గాయలు కొనుక్కొని తిన్న విషయం నాకు తెలుసు.
జీవితంలో మర్చిపోలేని సిసలైన అసౌకర్యాలు, కష్టాల గురించి తెలియాలంటే - ఎవరైనా సరే - ఒకే ఒక్కసారి ఫిలిం డైరెక్టర్ అయితే చాలు... 😊
సినిమా మొత్తం కనిపిస్తుంది... సీన్ బై సీన్. షాట్ బై షాట్. 🙌
సినిమా మొత్తం కనిపిస్తుంది... సీన్ బై సీన్. షాట్ బై షాట్. 🙌
Film is a battleground!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani