ఆమధ్య ఒక కాలేజి ఫంక్షన్లో స్పీచ్ ఇస్తూ, యస్ యస్ రాజమౌళి కూడా దాదాపు ఇలాంటిదే ఒక విషయం చెప్పాడు: "ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎన్నో అబద్ధాలాడాల్సి ఉంటుంది. ఎన్నో మేనిప్యులేషన్స్ చెయ్యాల్సి ఉంటుంది. నీ ప్రొఫెషన్ కోసం అవన్నీ చెయ్యి. కాని, నీకు నువ్వు అబద్ధాలు చెప్పుకోకు... నిన్ను నువ్వు మభ్యపెట్టుకోకు" అని.
ఇంకొక ఇంటర్వ్యూలో - ఇప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథారచయిత విజయేంద్రప్రసాద్ గారు ఒక ప్రశ్నకు సమాధానంగా, "ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే మీరు అబద్ధాలు బాగా చెప్పగలగాలి" అన్నారు.
కట్ చేస్తే -
ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి బిజినెస్‌కు, ప్రతి ప్రొఫెషన్‌కు ఆయా చోట్ల సక్సెస్ సాధించడానికి, నిలదొక్కుకోడానికి కొన్ని ప్రాథమిక సూత్రాలుంటాయి. ఒక వ్యవహారశైలి ఉంటుంది. వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి ప్రిన్సిపుల్స్ ఉన్నా, ఇక్కడ మాత్రం ఈ బేసిక్ సూత్రాలకు ఎవరి శైలిలో వారు ఎడాప్ట్ అవక తప్పదు. అలా కాగలిగినవారే ఎక్కడైనా సక్సెస్ సాధిస్తారు.
సింపుల్‌గా చెప్పాలంటే - తాడిచెట్టుకిందకి వెళ్ళినప్పుడు మనం అక్కడ కల్లే త్రాగాలి. కల్లు మండువాలో కూర్చొని నేను కాఫీ త్రాగుతాను అంటే కుదరదు.
ఈ సంఘర్షణలోనే కొంతమందికి జీవితం అయిపోతుంది. కొంతమంది మాత్రం నిమిషాల్లో మౌల్డ్ అయిపోతారు.
కట్ చేస్తే -
పైన చెప్పిన ఉదాహరణల్లో ఆర్జీవీ, రాజమౌళి, విజయేంద్రప్రసాద్ గారు చెప్పింది కూడా ఇదే. వారు చెప్పిన అబద్ధాలు, మేనిప్యులేషన్స్ అంటే ఇంకేదో కాదు. ఇండస్ట్రీలో పనులు ముందుకు కదిలేలా ఎదుటివారిని కన్విన్స్ చెయ్యగలగటం. మనలో ఏ మూలో ఉన్న కాస్తంత ఈగోని కాసేపు పక్కనపెట్టగలగటం.
ఒక హాయ్, ఒక హగ్, రెండు షేక్ హాండ్స్, నాలుగు థాంక్యూలు.
ఒక హాయ్, ఒక హగ్, రెండు షేక్ హాండ్స్, నాలుగు థాంక్యూలు.
దట్సిట్.
యు ఆర్ ఆన్ ద ట్రాక్. తర్వాతంతా నీ సత్తా.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani