Thursday, 2 July 2015

స్విమ్మింగ్‌పూల్‌లో కె జె దశరథ్!

సూపర్ పర్సనాలిటీ. పవర్‌ఫుల్ వాయిస్. సినిమా అంటే ప్యాషన్.

దటీజ్ కె జె దశరథ్!

మా ఇద్దరి పరిచయం సుమారు మూడేళ్లనాటిది. అప్పుడే ఒక ప్రాజెక్టుకు మేం కలిసి పనిచేయాల్సింది. కలలో కూడా నేనెన్నడూ ఊహించని నా భారీ యాక్సిడెంట్ వల్ల అది కుదర్లేదు. వాయిదాపడింది.

మరోసారి ఇంకా బాగా కలిసి పనిచేసే అవకాశాన్ని ఆయనే క్రియేట్ చేశారు. కానీ అనుకున్నది జరగలేదు. అంతా ఉల్టాపుల్టా అయిపోయింది.

అయినా సరే, ఎలాగయినా దశరథ్‌ను వెండితెరకు నేనే పరిచయం చేయాలనుకున్నాను.

బికాజ్ .. అతనిలో ఓ మంచి స్నేహితుడు కూడా ఉన్నాడు కాబట్టి. యాక్టింగ్ అంటే అతనికి చచ్చేంత ప్యాషన్ కాబట్టి.

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ -  

కె జె దశరథ్ ఇంతకుముందే చాలా యాడ్స్‌లో, ఇన్‌ఫమర్షియల్స్‌లో నటించారు. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం నా స్విమ్మింగ్‌పూల్ సినిమాతోనే ఎంట్రీ!

"సినిమాలో నటించడం నాకు మొదటిసారి. నేను బాగా చేయగలనో .. లేదో!" అని షూటింగ్‌కి ముందు చాలాసార్లు నాతో అన్నారు దశరథ్.

నాకు మాత్రం బాగా నమ్మకం. అతను బాగా నటించగలడనీ, నటించేలా నేను చేయగలననీ.

స్విమ్మింగ్‌పూల్ హారర్ సినిమా కాబట్టి ఎక్కువ పాత్రలకు అవకాశం లేదు. అయినా సరే - దశరథ్‌కు బాగా సూటయ్యే ఒక మంచి రోల్‌ను ఆయనకిచ్చాను.

ఆ పాత్ర మ్యానరిజం, డైలాగులు ఎంత వెరైటీగా ఉండేలా నేను ప్లాన్ చేశానో - అంతకంటే అద్భుతంగా దశరథ్ ఆ పాత్రలో జీవించారు.

అయినా  .. నాకు సంతృప్తి లేదు. యాక్టర్‌గా దశరథ్‌కు ఓ పెద్ద పవర్‌ఫుల్ రోల్‌తో నేనే బ్రేక్ ఇవ్వాలి.

ఆరోజు కోసమే నేను ఎదురుచూస్తున్నాను. బహుశా దశరథ్ కూడా. 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani