> స్వీమింగ్‌పూల్ ఆడియో "లైవ్" చేయాలన్నది అసలు మా ప్లాన్‌లో ఎన్నడూ లేదు. కానీ, చేశాం. హీరో అఖిల్ కార్తీక్ కోసం, మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర కోసం. టోటల్‌గా మా సినిమా కోసం.
> ఎవరికోసం చేశామన్నది కాదు కొశ్చన్. ఎలా చేశామన్నదే ముఖ్యం! ఘనంగా/గ్రాండ్‌గా చేశామని వచ్చిన ఆహూతులంతా అన్నారు. టీవీలో లైవ్ చూసిన ఎందరో ఫోన్ చేసి/మెసేజ్‌లు పెట్టి/మెయిల్స్ రాసి కూడా ఇదే మాట అన్నారు.
> శిల్ప చక్రవర్తి యాంకరింగ్ సింప్లీ వెరీ నైస్! వేరే ఎవ్వరయినా ఈ ప్రోగ్రాం ఇంత బాగా వచ్చేది కాదు.
> ఈమధ్యే, అదే ఆడిటోరియంలో జరిగిన ఒక పేరున్న హీరో ఆడియో లైవ్‌కు సగం కుర్చీలు కూడా నిండలేదు. బట్ .. స్విమ్మింగ్‌పూల్ ఆడియోకు మాత్రం ఫుల్ ప్యాక్!
> ఎల్ ఇ డి మీద ప్లే చేసిన ఫోటోలు, టీజర్లు అన్నీ అదరహో! అన్నీ అందరూ ఎంజాయ్ చేశారు.
> పెద్ద పెద్ద సినీ కుటుంబాల ఆడియోలు ఎన్నింటికో అటెండయిన నా బిజినెస్ మాగ్నెట్ మిత్రులొకరు " రెండు గంటలకు పైగా కుర్చీలో కూర్చొని నేను చూసిన మొట్టమొదటి ఆడియో ఫంక్షన్ ఇదే" అని నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టడం నాకు చాలా సంతోషం.
> షూటింగ్ కోసం నాకు లొకేషన్ ఇచ్చిన వెంకట్రావు గారికి, ఇప్పించిన నా మిత్రులకు, ప్రొడక్షన్/పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో నాకు సహకరించిన మిత్రులు రాజు గారికి, నాకు ఎంతో సహకరించిన నా ప్రియాతిప్రియమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల టీమ్ మొత్తానికి, మా ప్రొడ్యూసర్ అరుణ్ గారికి, ఈ సినిమా అమెరికా షూటింగ్ విషయంలో నాకోసం ఎంతో శ్రమ తీసుకున్న నా ఆత్మీయ మిత్రుడు సదానందం భరతకూ, నాతో క్వాలిటీ టైమ్ మిస్ అవుతున్న నా కుటుంబానికీ, ప్రోగ్రాంకు వచ్చిన ఆహూతులకు, గెస్ట్‌లకు, ప్రెస్‌వారికందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
> ఇదంతా నేను స్టేజ్ మీదే చెప్పాల్సింది. కానీ .. అప్పటికే, టాలీవుడ్ చానెల్ 'లైవ్ టైమ్' క్రాస్ అయిపోతున్నందువల్ల, తర్వాత అఖిల్ కార్తీక్, ముప్పలనేని శివగారు మాట్లాడాల్సింది ఉండడం వల్ల .. అసలు ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియకుండా, నేను మాట్లాడ్డం చాలా షార్ట్ కట్ గా ముగించేశాను.
> ఎంత పెద్ద గెస్ట్‌లు వచ్చారన్నది కాదు పాయింట్. మనకోసం వచ్చిన గెస్ట్‌లే నిజమైన పెద్ద గెస్ట్‌లు అన్నది నేను గుర్తించాల్సిన అసలు పాయింట్ అన్నది నాకు బాగా అర్థమయింది. మా అఖిల్ కార్తీక్‌కు కూడా!
> ఇదంతా నేను స్టేజ్ మీదే చెప్పాల్సింది. కానీ .. అప్పటికే, టాలీవుడ్ చానెల్ 'లైవ్ టైమ్' క్రాస్ అయిపోతున్నందువల్ల, తర్వాత అఖిల్ కార్తీక్, ముప్పలనేని శివగారు మాట్లాడాల్సింది ఉండడం వల్ల .. అసలు ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియకుండా, నేను మాట్లాడ్డం చాలా షార్ట్ కట్ గా ముగించేశాను.
కట్ టూ ఫినిషింగ్ టచ్ -
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani