సందేహం లేదు. ఈ మన్మథ నామ సంవత్సరంలో సినిమా ఫీల్డులో నేను అనుకున్న చిన్న చిన్న లక్ష్యాలన్నీ ఛేదిస్తాను.. చేరుకుంటాను.
కొద్దిరోజుల్లోనే, చాలా గ్యాప్ తర్వాత నేను చేస్తున్న సినిమా "స్విమ్మింగ్‌పూల్" ఫస్ట్ కాపీ రాబోతోంది. ఆ తర్వాత ఆ సినిమా ఆడియో రిలీజ్, రిలీజ్ ఉంటాయి.
ఇప్పటికే ఆదిత్య ద్వారా యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన స్విమ్మింగ్‌పూల్ ప్రమోషనల్ సాంగ్‌కు ఆన్‌లైన్‌లో ఆదరణ అదిరిపోతోంది. కేవలం 5 రోజుల్లోనే ఆ వీడియో 20 వేలను దాటింది అంటే విషయం అర్థంచేసుకోవచ్చు.
మొదటిసారిగా ఒక చిన్న బడ్జెట్ సినిమా స్విమ్మింగ్‌పూల్ .. అమెరికాలోని అన్ని ప్రధాన సెంటర్‌లలో ఒక భారీ సినిమా రేంజ్‌లో రిలీజ్ కాబోతోంది. ఆ ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇంకా యు కె, జర్మనీ, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ అవుతోంది.
ఈ వివరాలన్నీ అతి త్వరలో ఎప్పటికప్పుడు మీరు నా ఫేస్‌బుక్ లోనూ, ఇదే బ్లాగ్ లోనూ చూస్తారు.
కట్ టూ హీరో అండ్ హీరోయిన్ -
ఈ సంవత్సరం కార్తీక్ తప్పక ఒక రేంజ్ కు చేరుకుంటాడు. ఎప్పటినుంచో అతనితో దాగుడుమూతలు ఆడుతున్న హిట్ ఇప్పుడు అతన్ని అక్కున చేర్చుకోబోతోంది.
ఇక, మా హాట్ హీరోయిన్ ప్రియ వశిష్ట స్విమ్మింగ్‌పూల్ తర్వాత కనీసం ఒక 3 సినిమాలు సైన్ చేస్తుంది .. 6 దేశాలు తిరుగుతుంది.
ఇది జోస్యం కాదు. వారు పడ్డ కష్టం, దాని ఫలితం.
వీరితోపాటు నా టీమ్‌లో, నాతో పాటు నిజంగా కష్టపడ్డ అందరికీ .. ఈ సంవత్సరం, ఆ తర్వాత కూడా .. అన్నివిధాలుగా బాగుంటుందనీ, ఉండాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
కట్ టూ ఫినిషింగ్ టచ్ -
నేను ఈ చిత్రం ద్వారా పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్రకు అప్పుడే 3 సినిమాలు వచ్చాయి. పిచ్చి బిజీ అయిఫొయాడు.
ప్రదీప్, యూ రాక్!
"నాకు తెలిసి ఆయనకు అసలు మ్యూజిక్ రాదు!" అనీ, ఇంకా ఏదేదో చెత్త అంతా ఎవరెవరో వాగుతుంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. ఒక లక్ష్యం కోసం నిజంగా కష్టపడేవారెప్పుడూ, తోటివారిని అలా సరదాకి కూడా అనలేరు. వాళ్లంతా అలా అంటూ అక్కడే ఉంటారు. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani